Dandruff Home remedies In telugu :చుండ్రు సమస్య వచ్చిందంటే తొందరగా తగ్గదు. దాంతో మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వైపు చూస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సులభంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చుండ్రు సమస్య నుండి బయట పడవచ్చు.
శనగపిండి:
ఒక కప్పు పెరుగులో నాలుగు స్పూన్ల శనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని గడ్డలు లేకుండా కలపి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను వెంట్రుకల మొదళ్లనుంచి చివళ్ల దాకా బాగా పట్టించాలి. అరగంటసేపు ఆరనిచ్చి తలస్నానం చేయాలి. ఇలా కొన్ని వారాల పాటు చేసినట్లయితే చుండ్రు ఏ మందులూ లేకుండానే క్రమంగా తగ్గిపోతుంది.
మెంతులు, పెరుగు పేస్ట్
మెంతులను ముందురోజు రాత్రి పెరుగులో నానబెట్టి ఉదయం మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకుని వెంట్రుకలకు బాగా పట్టించాలి. మెంతులు చుండ్రు నివారణలో చాలా బాగా పని చేస్తాయి.