oats chikki: పిల్లలకు ఎంతో బలాన్ని ఇచ్చే ఓట్స్ చిక్కి...కేవలం 10 నిమిషాల్లో...చాలా సింపుల్

కావాల్సిన పదార్థాలు:
ఓట్స్ - 500 గ్రాములు, బెల్లం - 300 గ్రాములు, బాదం పప్పులు - 20, పిస్తా పప్పు - 15, నువ్వులు - పావు కప్పు, పల్లీలు - పావు కప్పు, జీడి పప్పు - పావు కప్పు, నెయ్యి - అర కప్పు,

తయారుచేయు విధానం:
ఓట్స్, బాదం పప్పులు, పిస్తా, పల్లీలు, నువ్వులు, జీడి పప్పుల్ని విడివిడిగా వేగించుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నెయ్యి, ఆ తర్వాత బెల్లం కొద్దిగా నీళ్లు పోసి ముదురు పాకం వచ్చే వరకూ మరిగించి దించేయాలి. 

ఇందులో వేగించి పెట్టుకున్న ఓట్స్, మిగతా పప్పుల్ని అందులో వేసి బాగా కలపాలి. ఒక పళ్లానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమం వేసి చల్లారనివ్వాలి. తర్వాత మనకి నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top