Vitamin-D foods : మన శరీరానికి విటమిన్ డి అనేది ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. హార్మోన్ల ఆరోగ్యంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అంతే కాకుండా కండరాల పనితీరు మరియు నాడీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.
మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. విటమిన్ డి సమృద్ధిగా లభించే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిది.
పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. ప్రతిరోజు ఒక స్పూన్ విత్తనాలను నానబెట్టి తీసుకుంటే ఎముకలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా నాడీ సంబంద సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. విటమిన్ డి మన శరీరానికి బాగా అందుతుంది.
Ciick Here : వెల్లుల్లిలో ఉన్న ఈ ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
అంజీర్ పండ్లలో విటమిన్ డి చాలా సమృద్ధిగా ఉంటుంది. అంజీర్ పండ్లలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి అనేవి శరీరానికి శక్తిని ఇవ్వటమే కాకుండా హార్మోన్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక అంజీర్ ను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినటం అలవాటు చేసుకోండి.
బాదంపప్పు ప్రతిరోజు తీసుకోవడం వలన విటమిన్ డి లోపం లేకుండా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగుపరచడమే కాకుండా నాడీ సంబంద సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. రాత్రి సమయంలో నాలుగు లేదా ఐదు బాదంపప్పులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన బాదంపప్పు పై తొక్క తీసి తినాలి. ఈ విధంగా తింటూ ఉంటే విటమిన్ టి లోపం క్రమంగా తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.