బంగాళదుంప పాలక్ కర్రీ చాలా సులభంగా రెస్టారెంట్ స్టైల్ లో ఈ విధంగా చేసుకుంటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. రోటీ లేదా జీరా రైస్‌తో బాగుంటుంది.
కావలసిన పదార్ధాలు
¼ కప్పు నూనె
1 tsp జీలకర్ర
చిటికెడు ఇంగువ
1 ఎండిన ఎర్ర మిరపకాయ
5 వెల్లుల్లి (తరిగిన)
2 అంగుళాల అల్లం (తరిగిన)
2 ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి)
3 బంగాళదుంపలు (క్యూబ్డ్)
½ స్పూన్ పసుపు
½ స్పూన్ ఉప్పు
2 టేబుల్ స్పూన్లు నీరు
1 స్పూన్ కారం పొడి
1 స్పూన్ ధనియాల పొడి
½ స్పూన్ జీలకర్ర పొడి
½ స్పూన్ ఉప్పు
3 టమోటాలు (తరిగిన)
1 బంచ్ పాలక్ (తరిగిన)
½ స్పూన్ గరం మసాలా
2 టేబుల్ స్పూన్లు కసూరి మేతి (తరిగిన)
2 టేబుల్ స్పూన్లు స్ప్రింగ్ ఆనియన్ (తరిగిన)
తయారి విధానం
ముందుగా, ఒక పెద్ద కడాయిలో ¼ కప్పు నూనె వేసి వేడి చేయండి. 1 టీస్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ మరియు 1 ఎండు మిరపకాయ వేసి వేగించాలి. ఆ తర్వాత 5 వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి ఒక నిమిషం వేగాక, ఉల్లిపాయ ముక్కలు వేసి gold కలర్ వచ్చే వరకు వేగించాలి.
ఆ తర్వాత 3 బంగాళదుంపలు, ½ tsp పసుపు మరియు ½ tsp ఉప్పు వేసి బాగా కలిపి 2 టేబుల్ స్పూన్ల నీరు వేసి, మూతపెట్టి 10 నిమిషాలు లేదా బంగాళదుంప బాగా ఉడికిన తర్వాత 1 tsp మిరప పొడి, 1 tsp ధనియాల పొడి, ½ tsp జీలకర్ర పొడి మరియు ½ tsp ఉప్పు, 3 టమోటాలు వేసి 2 నిమిషాలు వేయించాలి.
ఆ తర్వాత పాలకూర వేసి 5 నిమిషాలు అయ్యాక ½ tsp గరం మసాలా, 2 టేబుల్ స్పూన్లు కసూరి మేథీ మరియు 2 టేబుల్ స్పూన్లు స్ప్రింగ్ ఆనియన్ వేసి బాగా కలపండి. అంతే Aloo Palak Recipe రెడీ.