Tomato Chutney : ఇడ్లీలు, దోశ‌ల‌లోకి ట‌మాటా చ‌ట్నీ.. భ‌లే రుచిగా ఉంటుంది..!

Tomato Chutney:ట‌మాటాలను ప్రతి రోజు వంటింటిలో ఉపయోగిస్తూ ఉంటాం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ‌ వంటి వాటిలోకి ఇప్పుడు చెప్పే టమోటా చ‌ట్నీని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

కావలసిన పదార్ధాలు 
వేయించడానికి:
1 కిలోల టమోటా
2 టేబుల్ స్పూన్లు నూనె
15 వెల్లుల్లి

చట్నీ కోసం:
½ కప్పు నూనె
1 స్పూన్ ఆవాలు
1 స్పూన్ మినపప్పు 
1 స్పూన్ శనగ పప్పు
¼ స్పూన్ మెంతులు 
2 ఎండిన ఎర్ర మిరపకాయ 
 కరివేపాకు
చిటికెడు ఇంగువ 
4 టేబుల్ స్పూన్లు కారం పొడి
1 స్పూన్ పసుపు
2 టేబుల్ స్పూన్లు ఉప్పు
1 టేబుల్ స్పూన్ బెల్లం

తయారి విధానం 
పొయ్యి మీద పాన్ పెట్టి  పాన్‌లో 1 కిలోల టమోటాను సగానికి కట్ చేయాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి మీడియం మంట మీద రెండు వైపులా ఉడికించాలి. అలాగే 15 వెల్లుల్లి రెబ్బలను కూడా రెండు వైపులా ఉడికించాలి. 

ఉడికిన టమోటా,వెల్లుల్లిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. పెద్ద కడాయిలో, ½ కప్పు నూనె వేడి చేయండి. 1 tsp ఆవాలు, 1 tsp మినపప్పు , 1 tsp శనగ పప్పు, ¼ tsp mentulu , 2 ఎండిన ఎర్ర మిరపకాయ,  కరివేపాకు మరియు చిటికెడు ఇంగువ వేసి వేగించాలి. 

ఆ తర్వాత మంటను తగ్గించి  4 టేబుల్ స్పూన్ల కారం మరియు 1 స్పూన్ పసుపు వేసి కలపాలి. ఆ తర్వాత   సిద్ధం చేసిన టమోటా వెల్లుల్లి పేస్ట్  వేసి బాగా కలపాలి. మూతపెట్టి 20 నిమిషాలు ఉడికించాలి లేదా నూనె పక్కల నుండి విడిపోయే వరకు ఉడికించాలి.

అలాగే, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు మరియు 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసి బాగా కలపండి. అంతే 
ఇడ్లీ లేదా దోసతో టమోటా చట్నీని సర్వ చేయండి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top