Saggubiyyam Vadiyalu:ఎండతో పని లేకుండా ఫ్యాన్ కిందే ఆరబెట్టుకొనే టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం వడియాలు

ఎండతో పని లేకుండా ఫ్యాన్ కిందే ఆరబెట్టుకొనే టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం వడియాలు

కావలసినవి:
ఒక కప్పు సగ్గుబియ్యం కి మూడు కప్పులు water మిక్సీలో కలపడానికి, 5 కప్పులు water మరిగించుకోవడానికి ,ఉప్పు పచ్చిమిర్చి కారం, జీలకర్ర.

చేసే విధానం:
ఒక కప్పు సగ్గుబియ్యం మిక్సీ జార్ లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది కొంచెం రవ్వ రవ్వలా ఉంటుంది. అలా ఉండగానే మూడు కప్పులు నీళ్లు దగ్గర పెట్టుకొని ఒక కప్పుతో ఒకసారి కలిపి చూడండి, కొంచెం నీళ్లు observe చేస్తాయి. మళ్ళీ ఇంకొక కప్పు వేసి ఇంకొకసారి బ్లెండ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఉండలు చుట్టకుండా ఉంటుంది.

మళ్లీ ఒకసారి మూత తీసి ఇంకొక కప్పు వాటర్ పోసి flexibility చూసుకోండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వంపండి. వేరొక మందం పాటి గిన్నెలో నాలుగు లేక ఐదు కప్పులు నీళ్లు పోసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా ఈ వాటర్ లోకి వేసి ఉండలు లేకుండా మీడియం ఫ్లేమ్ లో గరిటతో కలుపుకోవాలి. అర టీ స్పూన్ జీలకర్ర ,నాలుగు పచ్చిమిర్చి కానీ పండుమిర్చి గాని కచ్చాపచ్చాగా దంచుకుని ఆ వాటర్ లో కలుపుకోవాలి.

ఒక్క స్పూను నిమ్మరసం అవి తెల్లగా రావడానికి ఇష్టమైతే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఒక్కసారి కలిపి మూత పెట్టండి. కొంచెం చల్లారేసరికి అది వడియాలు పెట్టుకోవడానికి వీలుగా తయారవుతుంది. రెండు పొరలు తో ఉన్న ఒక కాటన్ క్లాత్ బాగా తడిపి పిండేసి ఫ్యాన్ కింద వడియాలు పెట్టుకునే వీలుగా పెట్టుకొని ఒక గరిట తోటి వడియాలు పెట్టుకోవాలి.

ఒకదానితో అంటకుండా దానిని స్ప్రెడ్ చేయకుండా వేసుకుంటే సరిపోతుంది. ఆరిన తర్వాత క్లాత్ మీద నీళ్లు చల్లి వడియాలు తీసి ఒక పళ్ళెంలో పెట్టి రెండు రోజులు ఎండలో పెట్టుకోండి మీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు నూనె కాగనిచ్చి డీప్ ఫ్రై లో పోడియాలు వేగించుకోండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top