Blood pressure:మీకు BP తగ్గిందా? అయితే ఇలా చేయండి... మాటిమాటికి కళ్ళు తిరగటం, కొద్దిసేపు నడిచిన, పని చేసిన నీరసించి అలసటకు గురి కావటం వంటి లక్షణాలు లో- బిపి కి సంబందించినవి. నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకుంటూ,ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
అప్పుడే ఈ సమస్యను అదుపులో ఉంచగలము. ముందు కాస్త ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్దాలకు ప్రాదాన్యత ఇవ్వాలి. ఎక్కువగా మంచినీరు త్రాగాలి. దీనికి బీట్ రూట్ రసం మంచి పరిష్కారంగా ఉంది.
ప్రతి రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ బీట్ రూట్ రసం త్రాగితే రక్తపోటు నియంత్రణకు వస్తుంది. రాత్రి పూట ఆరు బాదం పప్పులను నానబెట్టి, మరుసటి రోజున పొట్టు వలిచి, మెత్తగా గ్రైండ్ చేసి పాలలో మరిగించి త్రాగాలి.
తులసి ఆకులు కూడా రక్తపోటు ఉన్నవారికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పది తులసి ఆకులను నలిపి, దానిలో తేనే కలిపి తీసుకుంటే మంచిది. దూర ప్రయాణాలు చేసినప్పుడు ఉప్పు,తేనే దగ్గర ఉండాలి. కళ్ళు తిరిగినా, నీరసంగా ఉన్నా వెంటనే ఒక స్పూన్ తేనెలో కొంచెం ఉప్పు వేసుకొని త్రాగితే సరిపోతుంది.