Soya Kabab:సోయాతో ఇలా కబాబ్ చేయండి.. వదలకుండా తింటారు

Soya Kabab:సోయాతో ఇలా కబాబ్ చేయండి.. వదలకుండా తింటారు.. మంచి పోషకాలు ఉన్న సోయాతో ఇలా కబాబ్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.

కావాల్సిన పదార్దాలు
సోయాబీన్ పొడి - 100 గ్రా.
బ్రెడ్ క్రంబ్ పౌడర్ - 100 గ్రా.
అల్లం - చిన్నముక్క (సన్నగా తరగాలి)
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
పచ్చిమిర్చి - 4
గరంమసాలా, జీలకర్ర పొడి - అర టీ స్పూన్ చొప్పున
ఆమ్‌చూర్ పొడి (మార్కెట్లో లభిస్తుంది)
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - తగినంత
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
నూనె - తగినంత

తయారీ విధానం
పొయ్యి వెలిగించి బాండి పెట్టి రెండు స్పూన్స్ నూనె పోసి ఉల్లిపాయలు, అల్లం తరుగు, కొత్తిమీర, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి కొంతసేపు వేగాక, గరం మసాలా, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తరువాత దానిలో సోయాబీన్ పొడి, బ్రెడ్ క్రంబ్ పొడి వేసి బాగా వేగించాలి. 

కొంచెం చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకోని మిర్చి బజ్జీ సైజులో వత్తుకోవాలి. వీటిని నిప్పుల మీద లేదా గ్రిల్‌ మీద కాల్చుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే చాకుతో మధ్యకు కట్ చేయాలి. వీటికి మంచి కాంబినేషన్ పుదీనా చట్నీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top