Reduce Anxiety : ఆందోళనను తగ్గించడంలో సహాయపడే అద్భుతమైన ఆహారాలు


సాదారణంగా ఆందోళన అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఉద్యోగం,డబ్బు,పనీపాట, కుటుంబం వంటి వాటి వల్ల ఎప్పుడో ఒకప్పుడు ఆందోళన కలగక మానదు.ఆందోళన అనేది ఒక మానసికమైన వ్యాది. ఆందోళన ఉన్నప్పుడు మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. అందువల్ల ఒక పూర్తిస్థాయి ఆందోళన రుగ్మతతో బాధ పడుతున్నప్పుడు మందుల ద్వారా నయం చేసుకోవాలని అనుకోవచ్చు.

అయితే ఆందోళన నుండి సురక్షితంగా బయట పడటానికి కొన్ని నివారణ పద్దతులు ఉన్నాయి. మనస్సు,శరీరం లను ప్రశాంతంగా ఉంచుకొనే టెక్నిక్స్ మరియు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవటం ద్వారా ఆందోళన తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

L-theanine అనే అమైనో ఆమ్లం (గ్రీన్ టీ)
జపనీస్ బౌద్ధ సన్యాసులు ఎలర్ట్ గా,ప్రశాంతంగా గంటల కొద్ది ధ్యానం చేసుకోవటానికి గ్రీన్ టీ లో ఉండే L-theanine అనే అమైనో ఆమ్లం అని అమెరికన్ బొటానికల్ కౌన్సిల్ కి చెందిన మార్క్ బ్లూమెంటల్ చెప్పారు. 

కొన్ని పరిశోదనల ప్రకారం ఈ అమైనో ఆమ్లం పెరుగుతున్న గుండె రేటు, రక్తపోటును అరికట్టేందుకు మరియు ఆందోళన తగ్గించేందుకు సహాయపడుతుందని గుర్తించారు. ఆందోళన కలిగిన వారికి 200 మిల్లీగ్రాముల L-theanine అనే అమైనో ఆమ్లంను ఇచ్చి పరిశీలన చేయగా వారు ప్రశాంతంగా ఉండటం గమనించారు. ఈ అమైనో ఆమ్లం గ్రీన్ టీలో సమృద్దిగా ఉంటుంది. అయితే రోజుకి గ్రీన్ టీని మూడు నుంచి నాలుగు కప్పుల వరకు త్రాగవచ్చు.

మంచి నీరు
ప్రతి రోజు ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల మంచి నీటిని త్రాగాలి. ఈ విధంగా త్రాగటం వలన డీ హైడ్రేషన్ బారిన పడకుండా మరియు ఆందోళన లేకుండా స్పష్టంగా ఆలోచించడానికి మరియు చేసే పని మీద దృష్టిని కేంద్రీకరించటానికి సహాయపడుతుంది.

బీన్స్
బ్లాక్ బీన్స్ లో ఉండే ప్రోటీన్, ఫైబర్, మరియు కార్బోహైడ్రేట్స్ మీరు పని మీద దృష్టి కేంద్రికరించ టానికి మరియు ఎలర్ట్ గా ఉండటానికి సహాయపడతాయి. అంతేకాక మీ మనస్సు,శరీరం ఆరోగ్యంగా నిర్వహించటానికి కూడా సహాయపడతాయి.

సోయా బీన్స్
సోయా బీన్స్ అనేది అనుకూలమైన ఆహారం కానప్పటికీ, ఆందోళన తగ్గించి మంచి ఫీలింగ్ ఇవ్వటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అంతేకాక శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిలో సహాయం చేస్తుంది.

గ్రీన్ టీ
మీకు సహాయం చేయటానికి గ్రీన్ టీలో చాలా రకాలు ఉన్నాయి. మీరు ఆత్రుత లేదా కోపంగా ఉన్నప్పుడు మీ మూడ్ ను మార్చటానికి బాగా సహాయపడుతుంది.

టమోటాలు
టమోటా పండు లేదా కూరగాయ అనే మీమాంస ఉన్నప్పటికీ ఆందోళన తగ్గించటానికి బాగా సహాయ పడుతుంది. టమోటాను పచ్చిగాను తినవచ్చు. అలాగే వండుకొని కూడా తినవచ్చు. ఏ రకంగా తీసుకున్న టమోటా బాగా పనిచేస్తుంది.

బీట్రూట్
బీట్రూట్ మీ షాపింగ్ జాబితాలో లేకపోతే వెంటనే జోడించండి. ఎందుకంటే వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా సానుకూల ప్రభావాలు ఉంటాయి. బీట్రూట్ లో ఉండే బెటైనే అనేది మూడ్ ని పెంచుతుందని గుర్తించారు. ఇది ఆందోళనకు వ్యతిరేకంగా పనిచేసి విశ్రాంతి భావనను కలిగించటంలో సహాయం చేస్తుంది.

పాలకూర
పాలకూరను పచ్చిగా లేదా వండి అయినా తీసుకోవచ్చు. పాలకూరను ఒక గొప్ప మూడ్ ఎలివేటర్ మరియు సమర్థవంతమైన శక్తి బూస్టర్ గా చెప్పవచ్చు. పాలకూరలో ఇనుము సమృద్దిగా ఉండుట వలన అలసటను తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది.

డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ అంటే అందరికి ఇష్టమే. డార్క్ చాక్లెట్ మెదడులో ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్ ఉత్పత్తిలో సాయం చేయటమే కాకా మంచి అనుభూతి కలగటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గించి తద్వారా ఆందోళన తగ్గటానికి సహాయపడుతుంది.

కొబ్బరి కాయ
కొబ్బరి కాయలో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన ఆందోళన తగ్గించి మంచి భావనకలగటానికి  సాయం చేస్తుంది. 

ప్రతి రోజు మంచి మూడ్ లో ఉండాలంటే కొబ్బరి నీరు త్రాగటం కానీ వంటల్లో కొబ్బరి కోరును జల్లుకోవటం కానీ చేస్తే సరిపోతుంది.

బెర్రీస్
మీరు మంచి అనుభూతి కోసం బెర్రీ పండ్లను తీసుకోవచ్చు. రాస్ప్బెర్రీస్, బ్లూ బెర్రీలు మరియు బ్లాక్ బెర్రీలలో యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన మంచి అనుభూతి మరియు ఆక్సీకరణ ఒత్తిడిని నివారించడానికి సహాయపడుతుంది.

సాల్మన్
మీరు ఆరోగ్యకరమైన గుండె మరియు మంచి మూడ్ కావాలని కోరుకుంటే సాల్మన్ చేపను తినటం అలవాటు చేసుకోండి. దీనిలో ఉండే ఒమేగా 3 ఆమ్లాలు ఆందోళనను తగ్గించటానికి సహాయపడతాయి. మాంసకృత్తులు సమృద్దిగా ఉన్న సాల్మన్ చేపను ప్రతి రోజు తినటానికి నిపుణులు సిఫార్స్ చేసారు.

పెరుగు
పెరుగులో కాల్షియం మరియు ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. ఇది మూడ్ ని మార్చి నిరాశ మరియు ఆందోళనను సులభంగా పోగొడుతుంది.

గుడ్లు
గుడ్లలో ప్రోటీన్,జింక్ రెండూ సమృద్దిగా ఉంటాయి. ఇవి మీ జీవక్రియ మరియు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం ద్వారా ఆందోళనను తగ్గిస్తుంది.

వేరుశెనగ
మీ మూడ్ ని మార్చటంలో వేరుశెనగ బాగా సహాయపడుతుంది. వేరుశెనగలో ఉండే సెలీనియం అనే ఖనిజం ఆందోళన తగ్గటానికి సహాయపడుతుంది.

చిలకడ దుంపలు
ఇవి ఆందోళనను తగ్గించటానికి మొదటి స్థానంలో ఉంటాయి. ఇవి మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి. దీనిలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణ చేస్తుంది. దీనిని బంగాళదుంపకు గొప్ప ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు.

లీన్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోండి
ఆందోళనను అధికమించి దీర్ఘ కాలము శక్తి ఉండేందుకు నట్స్, చికెన్, చేపలు వంటి వాటిని తీసుకోండి. అవి మీ ఆహార కోరికలను తగ్గించటానికి కూడా సహాయం చేస్తాయి.

తినకూడని ఆహారాలు
షుగర్ ఎక్కువగా ఉన్న బిస్కెట్లు, కేకులు, చాక్లెట్ మరియు గ్యాస్ ఉండే డ్రింక్స్ జోలికి వెళ్ళ కూడదు. వాటిల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉండుట వలన గ్లైసెమిక్ లెవల్స్ తొందరగా పెరిగి మీ మూడ్ మారటానికి కారణం అవుతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top