Weight Loss Tips : ఈ చిట్కాలు పాటించండి.. నెల రోజుల్లో బరువు తగ్గుతారు..బరువు కోల్పోవటం అనేది ఒకటి, రెండు రోజుల్లో జరిగే పని కాదు. జీరో సైజ్ ఫిగర్ ని సాదించాలంటే నడుము చుట్టుకొలతను తగ్గించుకోవాలి. మేము సాధ్యమైనంత త్వరగా బరువు కోల్పోయి సన్నగా తయారుకావాలని అనుకుంటున్నాం.
కానీ ఆరోగ్యకరముగా బరువు తగ్గటానికి చాలా సమయం పడుతుందని మాకు తెలుసు. దీనిని ఒక ప్రక్రియగా కొనసాగించి ప్రతి రోజు వ్యాయామాలు చేస్తూ ఆహారంలో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక వారం రోజుల్లో ఎలా బరువు కోల్పోవచ్చో కొన్ని చిట్కాల ద్వారా తెలుసుకుందాం.
1. తగినంత నిద్ర ఉండాలి
ఆరోగ్యకరముగా బరువు తగ్గటంలో నిద్ర కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. తగినంత నిద్ర ఉన్నప్పుడు జీవక్రియలు కూడా బాగా జరుగుతాయి. అంతేకాకుండా నిద్ర అనేది మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించటమే కాకుండా అతిగా తినడాన్ని
కూడా నియంత్రిస్తుంది.
2. తరచుగా తినటం
తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినటం వలన జీవక్రియల పనితీరు బాగుంటుంది. తద్వారా మీరు ప్రయత్నం లేకుండానే బరువు కోల్పోయే అవకాశం ఉంటుంది.
3. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్
ఉదయం మీరు తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ మీకు శక్తిని ఇస్తుంది. అంతేకాక తర్వాతి రోజు అదే సమయంలో ఆకలి వేసేలా చేస్తుంది. మీరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తక్కువగా తీసుకుంటారు కాబట్టి, మీరు తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ లో తాజా పండ్లు, ప్రోటీన్ మరియు తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి.
4. సంగీతం వింటూ
వ్యాయామం అనేది బరువు కోల్పోవటానికి సమర్ధవంతంగా సహాయపడుతుంది. అయితే మీరు రొటీన్ కి బిన్నంగా మంచి జోష్ తో వ్యాయామం చేయటానికి మంచి సంగీతాన్ని ఎంచుకోండి. మీకు ఇష్టమైన పాటలను వింటూ మీరు కోరుకున్న ఫిగర్ కోసం జిమ్ లో కష్టపడండి.
5. కోక్ లను త్రాగటం మానేయాలి
అత్యదిక కేలరీలు,అత్యదిక చక్కెరతో ఉన్న సోడా మరియు షుగర్ డ్రింక్స్ త్రాగటం మానేయాలి. ఒక కోక్ లో 30 గ్రాముల చక్కెర ఉంటుందని మీకు తెలుసా? మీరు తొందరగా బరువు తగ్గాలని అనుకుంటే మాత్రం ఇటువంటి షుగర్ డ్రింక్స్
త్రాగటం మానివేయటం చాలా మంచిది.
6.తక్కువ పరిమాణంలో ఆహారం
మీరు తినే ఆహారం బాగా తగ్గించకుండా మీ శరీరానికి అవసరమైన శక్తీ అందేలా ఆహారాన్ని తీసుకోవాలి. కానీ మీ భోజన పరిమాణాన్ని ( ఉదాహరణకు 3/4) కొద్దిగా తగ్గించుకుంటే వారం రోజుల్లో బరువు తగ్గటం అనేది మీరు గమనించవచ్చు.
7. స్పోర్ట్స్
మీరు ఒక వారం రోజుల్లో బరువు కోల్పోవటానికి స్పోర్ట్స్ చాలా బాగా ఆశ్చర్యకరమైన రీతిలో సహాయపడతాయి. జాగింగ్, వాకింగ్, స్టెప్ ఏరోబిక్స్, స్విమ్మింగ్, సైక్లింగ్,డాన్స్,జుంబా డాన్స్,ఇంటిని శుభ్రం చేసుకోవటం వంటి వ్యాయామాలు అత్యంత ప్రభావవంతముగా బరువు తగ్గటంలో సహాయపడతాయి.
8. భోజనం మానకూడదు
భోజనం మానివేస్తే మీ జీవక్రియ వేగం తగ్గుతుంది. తద్వారా బరువు నష్టం ప్రక్రియ చాలా నెమ్మదిగా మరియు మరింత కష్టతరం అవుతుంది. అంతేకాక భోజనం మానివేయటం వలన టెంప్టేషన్ కూడా ఎక్కువ అయ్యి ఆకలి అనుభూతి ఎక్కువ అవుతుంది. అప్పుడు తినవలసిన దాని కన్నా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవటం జరుగుతుంది.
9. 7 రోజుల ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్
మీరు వారం రోజుల్లో బరువు కోల్పోవచ్చని అని అంటే మీకు ఆశ్చర్యంగా ఉందా? దీనికి మీకు 7 రోజుల ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్ సహాయపడుతుంది. ఈ డైట్ ప్లాన్ ని ఒక నిపుణుడు సాయంతో చేస్తే మంచిది. మీరు ఒక బుక్ లో మీకు రోజువారీ ఆహారం ఎంత అవసరం, మీ ఆహారపు అలవాట్లు, మీరు ఎంత బరువు తగ్గాలని అనుకుంటున్నారో మొదలైన విషయాలను రాసుకోవాలి. ఈ విషయాలను రాసుకోవటం వలన ఒక పద్దతిలో బరువు తగ్గటానికి సహాయపడుతుంది. మీరు 7 రోజుల ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్ చేసినప్పుడు డైట్ లో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు మరియు తృణధాన్యాలు ఉండాలని గుర్తుంచుకోండి.
10. సూప్
ప్రతి రోజు ఆహారంలో సూప్ తీసుకోవటం వలన జీవక్రియ సాఫీగా జరగటమే కాకుండా మెరుగుదల కూడా ఉంటుందని ఒక పరిశోదనలో తెలిసింది. ఇది కూడా మీరు సులభంగా బరువు కోల్పోవటానికి సహాయపడుతుంది.
11. చిన్న ప్లేట్లు
చిన్న ప్లేట్లలో ఆహారం తినటం వలన తక్కువ పరిమాణంలో ఆహారాన్ని తీసుకుంటాం. అందువల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
12. కేలరీలను పరిమితంగా తీసుకోవాలి
కేలరీలను పరిమితంగా తీసుకోవటం వలన ఖచ్చితంగా మీరు బరువు తగ్గటానికిసహాయపడుతుంది. ఈ ప్రయోజనం పొందాలంటే మీరు తీసుకొనే భోజనాన్ని ముందుగానే సెట్ చేసుకోవాలి. అంటే మీ రోజువారీ క్యాలరీ అవసరాలకు అనుగుణంగా భోజనాన్ని సిద్దం చేసుకోవాలి. మీ వయస్సు, ఎత్తు, బరువు మరియు మీ చర్యల ఆధారంగా
కేలరీలు ఆదారపడి ఉంటాయి.
13. ఒక గ్లాస్ మంచి నీరు
మీరు భోజనం చేయటానికి ముందు ఒక గ్లాస్ మంచి నీటిని త్రాగితే, తక్కువ ఆహారం తీసుకోవటమే కాకుండా తొందరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
14. స్మార్ట్ షాపింగ్
మొదట మీరు షాపింగ్ చేయటానికి అసలు ఆకలితో వెళ్ళకూడదు. ఇక రెండో విషయానికి వస్తే టెంప్ట్ కలిగించే కుకీలు, చిప్స్, ఐస్ క్రీమ్స్, సోడా, పిజ్జాలు మరియు ఇతర అనారోగ్య, కొవ్వు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలను కొనుకోలు చేసే
దుకాణాలకు వెళ్ళటం మానివేయాలి.
15. రెస్టారెంట్ లకు వెళ్ళటం
మీరు రెస్టారెంట్ లకు రెగ్యులర్ గా వెళ్ళితే మాత్రం బరువు పెరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందువల్ల రెస్టారెంట్ లకు వెళ్ళినప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే ఆర్డర్ ఇవ్వటానికి ప్రయత్నించండి. పాస్తా లేదా పిజ్జాకి బదులుగా ఒక సలాడ్ తో లీన్ మాంసం లేదా చేప మరియు ఒక ఐస్ క్రీం లేదా ఒక కేక్ కి బదులుగా భోజనంలో ఫ్రూట్ సలాడ్ ని ఎంచుకోండి.
16. తాజా పండ్లు మరియు కూరగాయలు
భోజనం,స్నాక్స్ మధ్య విరామంలో ఆకలి అన్పిస్తే తాజా పండ్లు మరియు కూరగాయలు,బెర్రీలు తీసుకుంటే మంచిది. ఈ ఆరోగ్యకరమైన స్నాక్స్ మీ జీవక్రియను పెంచడానికి సహాయం చేయటమే కాకుండా మీరు ఆరోగ్యకరమైన మార్గంలో బరువు కోల్పోవటానికి సహాయం చేస్తాయి. అంతేకాక వీటిల్లో ఉండే విటమిన్లు,ఆరోగ్యకరమైన పోషకాలు మరియు ఫైబర్ మీ శరీరానికి పోషణను అందిస్తాయి.
17. మంచి నీరు త్రాగటం
మంచి నీరు అనేది బరువు కోల్పోవటంలో చాలా సహాయపడుతుంది. అంతేకాక జీవక్రియల వేగాన్ని పెంచటమే కాకుండా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. సాదారణంగా ఆకలి అనుభూతి అనిపించినప్పుడు మంచి నీరు త్రాగవచ్చు. ప్రతి రోజు దాదాపుగా 8 గ్లాసుల మంచి నీటిని త్రాగటం వలన అదనంగా ఉన్న బరువు తగ్గుతుంది.
18. రాత్రి సమయంలో తినటం మానివేయాలి
సాయింత్రం 6 గంటలు దాటిన తర్వాత తినటం మానివేయాలి. రాత్రి సమయంలో ఎక్కువసేపు మెలుకువగా ఉండుట వలన ఇది సాధ్యం కాదు. అందువలన రాత్రి సమయంలో ఆహారం తీసుకున్నా తర్వాత సుమారుగా మూడు లేదా నాలుగు గంటల తర్వాత మాత్రమే పడుకోవటం అలవాటు చేసుకోవాలి.
19. బరువును చూసుకోవటం
మీరు ప్రతి మూడు రోజులకు ఒకసారి బరువును చూసుకుంటే, అప్పుడు మీకు బరువు తగ్గాలనే ఉత్సాహం పెరుగుతుంది. ఈ బరువు చిట్కాలు మీకు బాగా ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాం. మీరు వీటిని పాటించి ఆరోగ్యంగా,ఆనందంగా ఉండండి.