Weight Loss Drink:ఇటీవలి రోజుల్లో అధిక బరువు (ఓవర్ వెయిట్) కోట్లాది మందికి పెద్ద సమస్యగా మారింది. ఇది శారీరకంగా మాత్రమే కాక, మానసికంగా కూడా అనేక సమస్యలను తెస్తుంది.
ఈ నేపథ్యంలో చాలా మంది బరువు తగ్గేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక ఆహార నియమాలను (డైట్) పాటిస్తున్నారు.
ఈ డైట్లో గ్రీన్ టీ తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు. బరువు తగ్గడానికి సహాయపడే పానీయాల్లో గ్రీన్ టీ ఒకటి.
మీరు కూడా బరువు తగ్గేందుకు రోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే, ఇకపై సాధారణ గ్రీన్ టీ కాకుండా, ఇప్పుడు చెప్పబోయే పదార్థాలను కలిపి తీసుకుంటే మరింత త్వరగా బరువు తగ్గవచ్చు.
దీని కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి, ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసుకోవాలి.నీరు మరిగిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు, అర టీ స్పూన్ వాము, అర టీ స్పూన్ సోంపు, అర టీ స్పూన్ అల్లం తురుము వేసి, 8 నుంచి 10 నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆపి, స్ట్రైనర్ ఉపయోగించి గ్రీన్ టీని వడకట్టి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి సేవించాలి.ఈ విధంగా గ్రీన్ టీని తయారు చేసి తీసుకోవడం వల్ల జీవక్రియ (మెటబాలిజం) రేటు గణనీయంగా పెరుగుతుంది.
ఇది కేలరీలు కరిగే ప్రక్రియను వేగవంతం చేసి, బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే, ఈ పద్ధతిలో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి.మధుమేహం ఉన్నవారు ఈ విధంగా గ్రీన్ టీ తయారు చేసి తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
అలాగే, సోంపు, వాము, అల్లం కలిపిన గ్రీన్ టీ తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.అంతేకాక, కీళ్ల నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయి.