White Hair:బ్లాక్ కలర్ ఉపయోగించకుండా జుట్టును నల్లగా మార్చే నూనె.. వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరవడం సహజమే. అయితే, నీటి కాలంలో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ఒత్తిడి పెరగడం, పోషకాహార లోపం, అనారోగ్యకర జీవనశైలి, రసాయన ఉత్పత్తుల వాడకం వంటివి ఇందుకు కారణాలుగా ఉన్నాయి.
ఈ కారణాల వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతుంది. తెల్లజుట్టును కప్పిపుచ్చేందుకు రసాయనాలతో తయారైన కలర్స్‌ను ఉపయోగిస్తారు. ఇవి తక్షణ ఫలితాలను ఇచ్చినప్పటికీ, రెగ్యులర్‌గా వాడితే జుట్టు దెబ్బతింటుంది. అయితే, సహజ పద్ధతులతో ఇంట్లోనే తెల్లజుట్టును నల్లగా మార్చవచ్చు. ఈ విషయంలో ఆయుర్వేద డాక్టర్ సలీమ్ జైడీ ఒక ప్రత్యేక నూనె తయారీ విధానాన్ని పంచుకున్నారు.
1.5 కప్పుల వర్జిన్ కొబ్బరి నూనె
1.5 కప్పుల కరివేపాకు
4 టేబుల్ స్పూన్ల మెంతులు
5 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి
తయారీ విధానం
ఒక పాన్‌లో వర్జిన్ కొబ్బరి నూనె వేసి గోరువెచ్చగా వేడి చేయండి.నూనె వేడెక్కగానే కరివేపాకు, మెంతులు వేసి 5-10 నిమిషాల పాటు మరిగించండి.తర్వాత ఉసిరి పొడి వేసి మరో 2 నిమిషాలు మరగనివ్వండి.మంట ఆపి, నూనె చల్లారనివ్వండి.
చల్లారిన తర్వాత నూనెను గాజు సీసాలో వడకట్టి నిల్వ చేయండి.ఈ నూనెను 2-3 నెలల వరకు ఉపయోగించవచ్చు.
బాటిల్‌ను బాగా షేక్ చేసి, నూనెను తలకు పట్టించండి.రాత్రి సమయంలో నూనె రాసి, తలకు మసాజ్ చేయండి.మరుసటి రోజు ఉదయం మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి.వారానికి 2 సార్లు, 2-3 నెలల పాటు ఈ నూనెను ఉపయోగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.ఈ నూనె వల్ల జుట్టు రాలడం తగ్గి, జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.
పదార్థాల ప్రయోజనాలు
కోల్డ్ ప్రెస్డ్ పద్ధతిలో తయారైన ఈ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
ఇది జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది మరియు జుట్టును లోపలి నుంచి బలంగా చేస్తుంది.
జుట్టు నల్లగా మారడానికి కూడా సహాయపడుతుంది.
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్, ప్రోటీన్లు వంటి పోషకాలు ఉంటాయి.
ఇవి జుట్టు రంగును నల్లగా మార్చడంతో పాటు, జుట్టును బలంగా చేసి, రాలడాన్ని తగ్గిస్తాయి.
నూనెగా లేదా ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు.
మెంతుల్లో ఫోలిక్ ఆమ్లం, విటమిన్లు A, K, C ఉంటాయి.
ఇవి జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి, జుట్టును బలంగా, పొడవుగా పెరిగేలా చేస్తాయి.
జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.
ఉసిరిలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడతాయి.
అందుకే హెయిర్ కేర్ ఉత్పత్తుల్లో ఉసిరిని విరివిగా ఉపయోగిస్తారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.