Shani Dosha:జాతకంలో శని దోషం ఉంటె.. నివారణకు కొన్ని మార్గాలు..

Shani Dosha
Shani Dosha:జాతకంలో శని దోషం ఉంటె.. నివారణకు కొన్ని మార్గాలు.. జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడు అనగానే చాలా మంది భయపడతారు. జాతకంలో శని దోషం ఉంటే జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శని గ్రహం నెమ్మదిగా సంచరించే గ్రహం కావడంతో, దాని ప్రతికూల ప్రభావాల వల్ల వ్యక్తి ఇబ్బందులు పడవలసి ఉంటుంది. కర్మల ఆధారంగా ఫలితాలను ప్రసాదించే శనిని న్యాయ దేవుడు అని కూడా పిలుస్తారు. శని దోష నివారణకు కొన్ని మార్గాలు మరియు పరిహారాలు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
శని దోషం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నవారు శివుడిని, హనుమంతుడిని పూజిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ దోషం నుంచి విముక్తి పొందేందుకు ప్రతి శనివారం దేవాలయాలను సందర్శించాలి. ఈ రోజున శని యంత్రంతో పూజ చేయడం వల్ల దోషం తొలగిపోతుంది.
శనివారం ఉదయం ఉపవాసం ఉండి, శని దేవుని ఆలయంలో నెయ్యితో దీపం వెలిగించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. శివలింగ స్వరూపుడైన శివునికి స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం, బిల్వపత్రాలతో అర్చన వంటి పూజలు చేయడం వల్ల శని దోషం తగ్గుతుంది.
శని దేవునికి ఇష్టమైన శనివారం రోజున నిరుపేదలకు, అవసరమైన వారికి బంగారం, వస్త్రాలు, ఆహారం వంటివి దానం చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా శనగపిండి, నెయ్యి, నల్లవస్త్రాలు వంటివి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
ప్రతి శనివారం తెల్లవారుజామున నిద్రలేచి, నూనెతో తలస్నానం చేసి, భక్తిశ్రద్ధలతో శని మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల బాధల నుంచి విముక్తి పొంది, దీర్ఘాయుష్షు, మంచి బుద్ధి, చెడు ప్రభావాల నుంచి దూరంగా జీవించవచ్చు.
శని దోష నివారణ కోసం ప్రతి శనివారం శని దేవుని ఆలయాన్ని సందర్శించాలి. ఈ రోజున శివాలయంలో శివ చాలీసా పఠించడం వల్ల కూడా శని యొక్క అశుభ ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, 108 సార్లు శని దేవుని మంత్రాన్ని జపించాలి.
రోజూ కాకికి పెసరపప్పు దానం చేయడం, ఆలయాల్లో 9 సార్లు నవగ్రహ పూజలు చేయడం, నీలిరాతి ఉంగరం ధరించడం వల్ల శని దోషం తగ్గుతుంది. అలాగే, శనివారం తెల్లవారుజామున సుందరకాండ పారాయణం చేయడం వల్ల కూడా శని గ్రహ దోషం దూరమవుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top