Joint Pains:కీళ్ల నొప్పులు తగ్గించే.. మ్యాజికల్ అయిల్.. ఇలా చేస్తే నొప్పులు నిమిషంలో మాయం.. మోకాళ్ళ నొప్పులు: ఇటీవలి కాలంలో వయసు పైబడిన వారు మాత్రమే కాకుండా, 30 ఏళ్ల వయసు వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. కారణం ఏదైనా కావచ్చు, మోకాళ్ళ నొప్పుల వల్ల తీవ్రమైన అసౌకర్యాన్ని అనుభవిస్తారు.
ఎక్కువసేపు పని చేయలేకపోవడం, నడవడం, నిలబడడం లేదా మెట్లు ఎక్కడం వంటివి కూడా చాలా కష్టంగా మారుతాయి. మీరు కూడా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే, ఇప్పుడు చెప్పబోయే ఈ ఆయిల్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మోకాళ్ళ నొప్పులకు ఆయిల్ తయారీ విధానం: ఈ ఆయిల్ మోకాళ్ళ నొప్పులకు ఔషధంలా పనిచేస్తుంది. దీన్ని తయారు చేయడానికి కింది విధంగా చేయండి:
ముందుగా స్టవ్ ఆన్ చేసి, ఒక గిన్నెలో 1 కప్పు నువ్వుల నూనె (Sesame Oil) పోసుకోండి.10 నుంచి 15 శుభ్రంగా పొట్టు తొలగించి, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి (Garlic) రెబ్బలను వేసి, 5 నిమిషాల పాటు ఉడికించండి.
ఆ తర్వాత, అందులో హాఫ్ టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు (Turmeric) వేసి, మరో 2-3 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.ఇప్పుడు ఈ ఆయిల్‌ను స్ట్రైనర్ ఉపయోగించి ఫిల్టర్ చేసి, చల్లారనివ్వండి.చల్లారిన తర్వాత ఒక బాటిల్‌లో నిల్వ చేయండి.
ఉపయోగం:
ఈ ఆయిల్‌ను మోకాళ్ళపై అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయండి.రాత్రి నిద్రించే ముందు లేదా స్నానం చేసే 2 గంటల ముందు రోజూ ఈ ఆయిల్‌ను ఉపయోగించండి.కొద్ది రోజుల్లోనే మీరు సానుకూల ఫలితాలను గమనిస్తారు.
ప్రయోజనాలు:
- ఈ ఆయిల్ సహజమైన నొప్పి నివారిణిగా (Natural Pain Killer) పనిచేస్తుంది.
- రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
- వాపును తగ్గిస్తుంది.
- మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- ఈ ఆయిల్‌లో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి, ఇవి ఆర్థరైటిస్ వల్ల కలిగే మోకాళ్ళ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
రోజూ ఈ ఆయిల్‌ను ఉపయోగించడం వల్ల మీ మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


