JAggery:రాత్రి పడుకొనే ముందు దీనితో కలిపి బెల్లం తింటే.. ఊహించలేనన్ని ప్రయోజనాలు.. బెల్లం తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా బెల్లంను ఒక ముఖ్యమైన పదార్థంతో కలిపి తింటే అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి రాత్రి పడుకునే ముందు తీపి ఏదో తినాలని అనిపిస్తుంది.
కానీ ప్రతిరోజూ కేకులు, చాక్లెట్లు వంటి తీపి పదార్థాలు తినడం ఆరోగ్యానికి హానికరం. ఇవి జీర్ణక్రియ సమస్యలు, బరువు పెరగడం వంటి సమస్యలకు దారి తీస్తాయి. అలాంటప్పుడు బదులుగా కొద్దిగా బెల్లంలో నెయ్యి కలిపి తినండి.
ఇలా చేయడం వల్ల బరువు పెరగడం వల్ల వచ్చే అసౌకర్యం తగ్గుతుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి. అందుకే ప్రతి రాత్రి భోజనం తర్వాత కొద్దిగా బెల్లం, నెయ్యి తినడం మంచిది.
బెల్లంలో నెయ్యి కలిపి తినడం రాత్రిపూట మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రోజువారీ ఆహారంలో బెల్లాన్ని చేర్చుకోవడం కూడా అవసరం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


