Ayushman Card:రూ.5 లక్షల ఉచిత వైద్యం.. ఒక్కసారా? పదిసార్ల? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం...

Ayushman Card
Ayushman Card:రూ.5 లక్షల ఉచిత వైద్యం.. ఒక్కసారా? పదిసార్ల? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం...పేద మధ్యతరగతి కుటుంబాలకు పెనుభారంగా మారుతున్న వైద్య ఖర్చుల నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకం 'ఆయుష్మాన్ భారత్' (Ayushman Bharat). ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది.

అయితే చాలామందికి ఒక పెద్ద సందేహం ఉంది. "ఈ కార్డును ఏడాదిలో ఎన్నిసార్లు వాడొచ్చు? ఒక్కసారి ఆసుపత్రికి వెళ్తే కార్డ్ పని అయిపోతుందా?" అని. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, రూల్స్ ఇప్పుడు చూద్దాం.

ఎన్నిసార్లు వాడొచ్చంటే.. దీనిపై కేంద్ర ప్రభుత్వ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి.

లిమిట్ లేదు: మీరు ఆసుపత్రికి ఎన్నిసార్లు వెళ్లాలి అనేదానిపై ఎలాంటి పరిమితి (Limit) లేదు.

అవసరం బట్టి: ఏడాదిలో లబ్ధిదారుడు లేదా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైన ప్రతిసారీ ఈ కార్డును ఉపయోగించుకోవచ్చు.

రూ. 5 లక్షలే ముఖ్యం: మీరు ఎన్నిసార్లు చికిత్స తీసుకున్నారు అన్నది ముఖ్యం కాదు.. మొత్తం చికిత్స ఖర్చు రూ.5 లక్షలు దాటకూడదు.

ఉదాహరణకు: మీరు మొదటిసారి వెళ్ళినప్పుడు రూ. లక్ష ఖర్చయితే, ఇంకా రూ.4 లక్షల బ్యాలెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎన్నిసార్లయినా మిగిలిన బ్యాలెన్స్ పూర్తయ్యే వరకూ వాడుకోవచ్చు.

ఎవరు అనర్హులు? (వీరికి కార్డ్ రాదు)
ఈ పథకం కేవలం పేద, నిరుపేద కుటుంబాల కోసం రూపొందించబడింది. అందుకే కింద పేర్కొన్న వారికి ఈ పథకం వర్తించదు:

ప్రభుత్వ ఉద్యోగులు.

ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించేవారు.

PF (ప్రావిడెంట్ ఫండ్) కట్ అయ్యే ప్రైవేట్ ఉద్యోగులు (వ్యవస్థీకృత రంగం).

ESIC సేవలు పొందుతున్నవారు.

కార్డ్ ఎలా పొందాలి?
మీరు ఈ పథకానికి అర్హులైతే, ఈ కార్డు పొందడం చాలా సులభం.మీ దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా మీ సేవ కేంద్రానికి వెళ్లండి.

అక్కడ ఆపరేటర్ మీ ఆధార్ లేదా రేషన్ కార్డ్ వివరాలతో మీరు అర్హులో కాదో చెక్ చేస్తారు.మీరు అర్హులైతే, పత్రాల వెరిఫికేషన్ పూర్తయ్యాక, అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారు. అప్రూవల్ రాగానే మీ ఆయుష్మాన్ కార్డును డౌన్‌లోడ్ చేసి ఇస్తారు.

ముఖ్య గమనిక: ఆరోగ్యం మహాభాగ్యం. మీరు అర్హులైతే వెంటనే ఈ కార్డు కోసం అప్లై చేసుకోండి. అత్యవసర సమయంలో ఇది మీ ప్రాణాలను, ఆస్తులను కాపాడుతుంది.

Tags: #AyushmanBharat #HealthInsurance #CentralScheme #FreeTreatment #HealthTips

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top