Business Ideas:మహిళలు రోజుకు 2 గంటలు కేటాయిస్తే చాలు.. ఇంట్లో నుంచే లక్షలు సంపాదించే టాప్-6 బిజినెస్ ఐడియాలు!
సొంతంగా ఏదైనా సాధించాలి.. ఆర్థికంగా స్థిరపడాలి అని ప్రతి మహిళా కోరుకుంటుంది. కానీ, ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకం వల్ల బయటకు వెళ్లి ఉద్యోగం చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే ఏమాత్రం నిరాశ చెందకండి!
కేవలం రోజుకు ఒకటి రెండు గంటలు కేటాయిస్తూ, అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లో నుంచే ప్రారంభించగల అద్భుతమైన బిజినెస్ ఐడియాలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. అవేంటో చూసేయండి..
తక్కువ పెట్టుబడి.. అదిరిపోయే ఆదాయం!
1. హోమ్ ఫుడ్ & క్లౌడ్ కిచెన్... పెట్టుబడి: రూ. 5 వేలు - రూ. 20 వేలు
మంచి రుచిగా వంట చేయడం వస్తే చాలు.. ఇంట్లోనే ఆరోగ్యకరమైన టిఫిన్స్, లంచ్ బాక్స్‌లు తయారు చేసి స్విగ్గీ, జొమాటో ద్వారా ఆన్‌లైన్‌లో అమ్మవచ్చు. మీ వంటల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే లోకల్ ఆర్డర్లు కూడా వెల్లువెత్తుతాయి.
2. యూట్యూబ్ వ్లాగింగ్ & కంటెంట్ క్రియేషన్... పెట్టుబడి: స్మార్ట్‌ఫోన్, మంచి ఇంటర్నెట్ (రూ. 2 వేలు - రూ. 8 వేలు)
ఇది ప్రస్తుత డిజిటల్ యుగంలో అత్యంత ఆకర్షణీయమైన రంగం. మీకు ఇష్టమైన అంశం.. వంటలు కావచ్చు, పేరెంటింగ్ టిప్స్, బ్యూటీ, లేదా చిన్న వ్యాపార ఆలోచనలు.. ఏదైనా సరే వీడియోలు తీసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అప్‌లోడ్ చేయండి. మీ కంటెంట్‌కు ఆదరణ పెరిగే కొద్దీ ఇంట్లోనే కూర్చుని భారీగా సంపాదించవచ్చు.
3. ఆన్‌లైన్ ట్యూటరింగ్ & క్లాసెస్.. పెట్టుబడి: రూ. 10 వేలు - రూ. 25 వేలు (లాప్‌టాప్, ఇంటర్నెట్ కోసం)
చదువు, మ్యూజిక్ లేదా ఏదైనా భాషపై మీకు పట్టు ఉంటే ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు పాఠాలు చెబుతూ, మీ నైపుణ్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు.
4. క్రాఫ్ట్స్ & హ్యాండ్‌మేడ్ వస్తువులు.. పెట్టుబడి: రూ. 5 వేలు - రూ. 15 వేలు
సృజనాత్మకత ఉంటే రెజిన్ ఆర్ట్, డిజైనర్ కొవ్వొత్తులు, హోమ్ మేడ్ సబ్బులు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారు చేయడం ఇప్పుడు సూపర్ ట్రెండింగ్. వీటిని తయారు చేసి ఆన్‌లైన్ ద్వారా దేశవ్యాప్తంగా విక్రయించవచ్చు.
5. డే-కేర్ సెంటర్ (క్రెచ్).. పెట్టుబడి: రూ. 10 వేలు - రూ. 30 వేలు
ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లే రోజులివి. కాబట్టి పిల్లలను సురక్షితంగా చూసుకునే డే-కేర్ సెంటర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంట్లో కాస్త స్థలం ఉంటే చాలు, పిల్లలకు అవసరమైన ప్లే-రూమ్ సెటప్ చేసి ఈ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు.
6. బ్యూటీ & బొటిక్ సర్వీసెస్..పెట్టుబడి: మీ స్కిల్, అవసరాన్ని బట్టి..
టైలరింగ్, మగ్గం వర్క్ లేదా బ్యూటీషియన్ కోర్సు చేసి ఉంటే, ఇంట్లోనే పార్లర్ లేదా బొటిక్ రన్ చేయొచ్చు. మీ డిజైన్లను ఆన్‌లైన్‌లో ప్రదర్శిస్తూ రీసెల్లింగ్ ద్వారా కూడా మంచి లాభాలు గడించవచ్చు.
మహిళలకు ప్రభుత్వ దన్ను: వ్యాపారం మొదలుపెట్టాలని ఉండి చేతిలో డబ్బులు లేవా? టెన్షన్ వద్దు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ముద్రా యోజన (Mudra Yojana), స్టాండప్ ఇండియా (Standup India), సిడ్బీ (SIDBI) వంటి పథకాల ద్వారా తక్కువ వడ్డీకే ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

