Indian Railways:స్లీపర్ టికెట్‌తోనే ఏసీలో ప్రయాణం.. రైల్వే శాఖ అదిరిపోయే ఆఫర్! ఈ ఒక్క ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు!
వేసవి కాలం వచ్చేస్తోంది.. సొంతూళ్లకు లేదా టూర్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? రైలు ప్రయాణం అంటే స్లీపర్ క్లాస్ టికెట్ ధర తక్కువ అని బుక్ చేసుకుంటాం. కానీ, ఆ రద్దీలో ప్రయాణం చేయడం కష్టంగా అనిపిస్తుంది కదా!
అదే స్లీపర్ క్లాస్ టికెట్ రేటుకే.. చల్లని ఏసీ కోచ్‌లో దర్జాగా ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా! అవును, మీరు విన్నది నిజమే. ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్రయాణికుల కోసం ఒక సూపర్ ఫీచర్‌ను అందుబాటులో ఉంచింది. అదేంటో, ఆ ఆప్షన్‌ను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.
ఏంటి ఆ ఆప్షన్? (Auto Upgradation) రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు చాలామంది గమనించని, లేదా పెద్దగా పట్టించుకోని ఆప్షన్ ఒకటుంది. అదే 'ఆటో అప్‌గ్రేడేషన్' (Auto Upgradation). టికెట్ రిజర్వేషన్ సమయంలో మీరు కనుక ఈ బాక్స్‌లో టిక్ మార్క్ పెడితే.. మీ ప్రయాణ దశ మారే అవకాశం ఉంది.
ఇది ఎలా పనిచేస్తుంది? సాధారణంగా మనం ఏ కోచ్‌లో టికెట్ బుక్ చేసుకుంటామో అందులోనే బెర్త్ వస్తుంది. కానీ..
మీరు 'ఆటో అప్‌గ్రేడేషన్' ఎంచుకున్నప్పుడు.. ఒకవేళ మీరు బుక్ చేసుకున్న స్లీపర్ క్లాస్ పూర్తిగా నిండిపోయి, పై తరగతి (3rd AC)లో బెర్తులు ఖాళీగా ఉంటే.. రైల్వే సిస్టమ్ ఆటోమేటిక్‌గా మీ టికెట్‌ను ఏసీకి అప్‌గ్రేడ్ చేస్తుంది.
అంతేకాదు, 3rd AC వారు 2nd ACకి, 2nd AC వారు 1st ACకి కూడా అప్‌గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
నయా పైసా ఖర్చు లేదు! అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇలా మీ టికెట్ స్లీపర్ నుండి ఏసీకి మారినా, మీరు ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. స్లీపర్ చార్జీతోనే ఏసీ కంఫర్ట్ పొందవచ్చు.
ఎవరికి వర్తిస్తుంది?
ఈ ఆఫర్ కేవలం ఆన్‌లైన్‌లో (IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా) టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. కౌంటర్ టికెట్లకు ఇది ఉండదు. హయ్యర్ క్లాస్‌లో సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ అదృష్టం వరిస్తుంది.
వచ్చే సారి ఇలా చేయండి: ఈసారి మీరు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేస్తున్నప్పుడు, ప్యాసింజర్ వివరాలు ఇచ్చే పేజీలో "Consider for Auto Upgradation" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై టిక్ చేయడం మర్చిపోవద్దు. మీ అదృష్టం బాగుండి, ఏసీలో సీట్లు ఖాళీగా ఉంటే.. మీ ప్రయాణం కూల్ కూల్‌గా మారిపోతుంది!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


