Top Loan Schemes :శుభవార్త: మీరు లోన్ తీసుకోండి.. వడ్డీ కేంద్రం కడుతుంది! ఇలా అప్లై చేసుకోండి..
డబ్బు అవసరం ఎవరికి ఉండదు చెప్పండి? వ్యాపారం మొదలుపెట్టాలన్నా, వ్యవసాయానికైనా, పిల్లల చదువులకైనా చేతిలో చిల్లిగవ్వ లేక చాలామంది సతమతమవుతుంటారు. పోనీ అప్పు చేద్దామా అంటే.. బ్యాంకుల వడ్డీలకు భయపడి వెనకడుగు వేస్తుంటారు.
కానీ, మీకు తెలుసా? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కొన్ని అద్భుతమైన పథకాల ద్వారా మీరు లోన్ తీసుకుంటే.. వడ్డీ భారం మీపై పడదు! అవును, మీరు విన్నది నిజమే. తక్కువ వడ్డీకే లేదా కొన్నిసార్లు 'వడ్డీ లేకుండానే' రుణాలు పొందే అవకాశం ఉంది. ఆ స్కీమ్స్ ఏంటో, ఎవరికి ఏ లోన్ సరిపోతుందో ఇక్కడ చూసేయండి.
1. వీధి వ్యాపారులకు 'పీఎం స్వనిధి' (PM Svanidhi) మీరు రోడ్డు పక్కన చిన్న వ్యాపారం (టిఫిన్ సెంటర్, కూరగాయలు, పండ్లు) చేస్తున్నారా? అయితే ఈ స్కీమ్ మీకోసమే.
ఎంత ఇస్తారు?: మొదట రూ. 10,000 ఇస్తారు. అది కరెక్ట్‌గా కడితే రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకు లోన్ పెంచుకోవచ్చు.
బెనిఫిట్: టైమ్‌కి డబ్బులు కడితే కేంద్రం 7% వడ్డీ రాయితీ ఇస్తుంది. అంటే మీకు పడే వడ్డీ చాలా నామమాత్రం అన్నమాట.
2. కుల వృత్తుల వారికి 'పీఎం విశ్వకర్మ' (PM Vishwakarma) కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, స్వర్ణకారులు.. ఇలా 18 రకాల కుల వృత్తుల వారికి ఇది వరం లాంటి పథకం.
వడ్డీ ఎంత?: బయట వడ్డీ ఎంత ఉన్నా సరే.. మీరు మాత్రం కేవలం 5% వడ్డీ కడితే చాలు. మిగతాది ప్రభుత్వమే చూసుకుంటుంది.
ప్రత్యేకత: ఈ లోన్‌కి ఎలాంటి షూరిటీ (Guarantee) అవసరం లేదు. ఉచిత శిక్షణతో పాటు పనిముట్లు కొనుక్కోవడానికి రూ. 15,000 కూడా ఇస్తారు.
3. రైతన్నలకు 'కిసాన్ క్రెడిట్ కార్డ్' (Kisan Credit Card) రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చే అద్భుతమైన మార్గం ఇది.
వడ్డీ లెక్క: సాధారణంగా 9% వడ్డీ ఉంటుంది. కానీ ప్రభుత్వ సబ్సిడీతో అది 7%కి తగ్గుతుంది.
సున్నా వడ్డీ?: మీరు తీసుకున్న లోన్‌ను గడువులోగా కడితే.. అదనంగా మరో 3% రాయితీ వస్తుంది (అంటే 4% వడ్డీ). కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన వడ్డీని కూడా భరిస్తున్నాయి. అంటే దాదాపు వడ్డీ లేని రుణమే!
4. చదువుల కోసం 'ఎడ్యుకేషన్ లోన్స్' (Education Loans) డబ్బుల్లేవని ఏ విద్యార్థీ చదువు ఆపేయకూడదు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేంద్రం భరోసా ఇస్తోంది.
ఎలా పని చేస్తుంది?: విద్యార్థి చదువు పూర్తయ్యే వరకు లోన్‌పై పడే వడ్డీని కేంద్ర ప్రభుత్వమే బ్యాంకుకు కడుతుంది.
ఎక్కడ అప్లై చేయాలి?: 'జన్ సమర్థ్' (Jan Samarth) పోర్టల్ ద్వారా ఇంట్లో నుంచే అప్లై చేసుకోవచ్చు.
గమనిక: ఈ పథకాలకు ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా తప్పనిసరి. మీరు లోన్ తీసుకున్న తర్వాత, వాయిదాలు (EMI) సక్రమంగా కడితేనే ఈ సబ్సిడీలు వర్తిస్తాయి. లేదంటే రాయితీ రద్దవుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


