Foxtail Millet Khichdi:షుగర్ పేషెంట్లకు, బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ డిన్నర్.. కడుపు నింపే కమ్మని 'సిరిధాన్యాల కిచిడీ'..
అన్నం తినకుండా ఉండలేము అనుకునే వారికి మిల్లెట్స్ (సిరిధాన్యాలు) బెస్ట్ ఆల్టర్నేటివ్. ఇది చాలా కంఫర్టింగ్ ఫుడ్.
కావాల్సిన పదార్థాలు: కొర్రలు (Foxtail Millets) - అర కప్పు, పెసరపప్పు - పావు కప్పు, క్యారెట్, టమాటా, బీన్స్ ముక్కలు - 1 కప్పు, జీలకర్ర, పసుపు, ఉప్పు, నెయ్యి - 1 టీస్పూన్.
తయారీ విధానం:
కొర్రలను, పెసరపప్పును కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి.కుక్కర్‌లో ఒక టీస్పూన్ నెయ్యి వేసి జీలకర్ర, కూరగాయల ముక్కలు వేసి కాస్త వేయించాలి.అందులో నానబెట్టిన కొర్రలు, పెసరపప్పు వేసి పసుపు, తగినంత ఉప్పు వేయాలి.
ఒక కప్పు కొర్రలు+పప్పు మిశ్రమానికి 3 లేదా 4 కప్పుల నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
ప్రయోజనాలు: కొర్రలు గ్లూటెన్ ఫ్రీ, పైగా రక్తంలో చక్కెరను అమాంతం పెంచవు. పెసరపప్పుతో కలవడం వల్ల జీర్ణం కావడం చాలా సులువు, మంచి నిద్ర పడుతుంది.

