Turmeric Ginger Shot:ఖరీదైన క్రీములు దండగ.. రోజూ ఉదయం ఈ 'గోల్డెన్ షాట్' తాగితే ముఖం మెరవాల్సిందే, డాక్టర్‌తో పనే ఉండదు!
అందం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి క్రీములు వాడుతున్నారా? ఆరోగ్యం కోసం రకరకాల సప్లిమెంట్లు మింగుతున్నారా? అయితే ఒక్కసారి మీ వంటగది వైపు చూడండి. మన పోపుల పెట్టెలో ఉండే రెండు సామాన్యమైన పదార్థాలు మీ శరీరంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలవు. అవే
'పసుపు - అల్లం'.
ఈ రెండింటి కలయికతో చేసే చిన్న ‘గోల్డెన్ షాట్’ ఇప్పుడు ఫిట్‌నెస్ ప్రియుల హాట్ ఫేవరెట్. రోజూ పరగడుపున దీన్ని తాగితే చర్మం నిగనిగలాడటమే కాకుండా, ఎన్నో అనారోగ్య సమస్యలు మాయమవుతాయి. మరి దీన్ని ఎలా తయారు చేయాలి? దీనివల్ల కలిగే అద్భుత లాభాలేంటో చూద్దాం.
‘గోల్డెన్ షాట్’ తయారీ విధానం:
ఇది తయారు చేయడం చాలా సులువు. కేవలం రెండు నిమిషాల్లో దీన్ని రెడీ చేసుకోవచ్చు.ఒక గ్లాసులో సగం వరకు గోరువెచ్చని నీళ్లు తీసుకోండి.అందులో ఒక టీస్పూన్ పసుపు, ఒక అంగుళం మేర దంచిన తాజా అల్లం ముక్క వేయాలి.
దీనికి అరచెక్క నిమ్మరసం, చిటికెడు నల్ల మిరియాల పొడి (పసుపు శరీరానికి పట్టాలంటే మిరియాల పొడి తప్పనిసరి) జోడించాలి.రుచి కోసం ఒక టీస్పూన్ తేనె కలుపుకోవచ్చు.
వీటన్నింటినీ బాగా కలిపి, వడపోసుకుని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగేయాలి.
ఈ 'మ్యాజిక్ డ్రింక్' తాగితే శరీరంలో ఏం జరుగుతుంది?
మెరిసే చర్మం మీ సొంతం: పసుపు చర్మానికి సహజమైన బంగారు కాంతిని ఇస్తుంది. అల్లం రక్తంలోని మలినాలను (Toxins) బయటకు పంపి మొటిమలు, నల్ల మచ్చలు తగ్గించి చర్మాన్ని తాజాగా మారుస్తుంది.
ఇమ్యూనిటీ బూస్టర్: పసుపులోని ‘కర్కుమిన్’, అల్లంలోని ‘జింజెరాల్’ పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా తిప్పికొడతాయి.
నొప్పులకు చెక్: కీళ్ల నొప్పులు, కండరాల వాపుతో బాధపడేవారికి ఈ పానీయం ఒక గొప్ప వరం. ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
జీర్ణక్రియ సూపర్: అల్లం కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తే.. పసుపు కాలేయం (Liver) పనితీరును మెరుగుపరుస్తుంది.
గుండె పదిలం: ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.
ముఖ్య గమనిక (వీరు జాగ్రత్త): ఈ పసుపు-అల్లం షాట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ.. పిత్తాశయ (Gallbladder) సమస్యలు ఉన్నవారు, రక్తం పలుచబడే మందులు వాడేవారు దీనికి దూరంగా ఉండాలి. గర్భిణులు, బాలింతలు వైద్యుల సలహా తీసుకున్నాకే దీన్ని తాగడం ప్రారంభించాలి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

