Vegetable Oats Soup:బరువు తగ్గాలనుకునే వారు చేసే అతిపెద్ద తప్పు రాత్రి పూట హెవీగా తినడం. డిన్నర్ ఎంత లైట్‌గా ఉంటే, బరువు అంత వేగంగా తగ్గుతారు. రాత్రి 7:30 లేదా 8:00 గంటల లోపు డిన్నర్ పూర్తి చేయడం వెయిట్ లాస్‌లో చాలా ముఖ్యం.
కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తూనే, క్యాలరీలు తక్కువగా ఉండి వేగంగా బరువు తగ్గించే అద్భుతమైన డిన్నర్ రెసిపీ..
రాత్రి పూట అన్నం లేదా రోటీలకు బదులుగా వేడివేడిగా ఒక బౌల్ సూప్ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, పొట్ట కూడా ఫ్రీగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు: రోల్డ్ ఓట్స్ - 3 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన కూరగాయలు (క్యారెట్, బీన్స్, క్యాబేజీ) - అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు - 3 (సన్నగా తరిగినవి), మిరియాల పొడి - అర టీస్పూన్, ఉప్పు - తగినంత, బటర్ లేదా ఆలివ్ ఆయిల్ - అర టీస్పూన్.
తయారీ విధానం: ఒక గిన్నెలో బటర్ వేడి చేసి, వెల్లుల్లి ముక్కలు వేయించాలి. అందులో కూరగాయల ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 పెద్ద కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి.
నీళ్లు మరుగుతున్నప్పుడు ఓట్స్, ఉప్పు, మిరియాల పొడి వేసి 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి సూప్ రెడీ!
ప్రయోజనాలు: ఇందులో క్యాలరీలు చాలా తక్కువ. ఓట్స్‌లోని ఫైబర్ వల్ల ఆకలి వేయదు, కూరగాయల వల్ల విటమిన్స్ అందుతాయి. బరువు తగ్గడానికి ఇది ది బెస్ట్ ఆప్షన్.

