Paneer Veg Stir-fry:నిద్రపోయేటప్పుడు కూడా ఫ్యాట్ బర్న్ అవ్వాలా? అయితే డిన్నర్‌లో ఈ 'పనీర్ స్టెర్ ఫ్రై' తినండి!

Paneer Veg Stir-fry
Paneer Veg Stir-fry:నిద్రపోయేటప్పుడు కూడా ఫ్యాట్ బర్న్ అవ్వాలా? అయితే డిన్నర్‌లో ఈ 'పనీర్ స్టెర్ ఫ్రై' తినండి!

రాత్రి పూట కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్థాలు) జీరో చేసి, కేవలం ప్రొటీన్ మాత్రమే తీసుకుంటే నిద్రపోయే సమయంలో కూడా ఫ్యాట్ బర్న్ అవుతుంది.

కావాల్సిన పదార్థాలు: లో-ఫ్యాట్ పనీర్ - 100 గ్రాములు (ముక్కలుగా కోసినవి), రంగురంగుల క్యాప్సికమ్ ముక్కలు - అర కప్పు, ఉల్లిపాయ - 1, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మకాయ, నూనె - 1 టీస్పూన్.

తయారీ విధానం:
పాన్‌లో కొద్దిగా నూనె వేసి ముందుగా పనీర్ ముక్కలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు మాత్రమే వేయించాలి (కూరగాయలు మెత్తబడకూడదు, క్రంచీగా ఉండాలి).

ఇప్పుడు వేయించిన పనీర్ ముక్కలు వేసి ఉప్పు, మిరియాల పొడి చల్లి బాగా కలపాలి. స్టవ్ ఆపేసి, పైన కొద్దిగా నిమ్మరసం పిండుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.

ప్రయోజనాలు: పనీర్ ద్వారా వచ్చే హై-ప్రొటీన్ కండరాలను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. ఇందులో అన్నం, రోటీ లేకపోవడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరగడం మొదలవుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top