Govt Job Recruitments in April :టెన్త్ పాస్ అయితే చాలు.. ఆర్మీ, నేవీల్లో 3000కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఏప్రిల్ నెలలో బంపర్ నోటిఫికేషన్లు.. టెన్త్, ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీ, నేవీ, SSBలలో భారీగా కొలువులు. వెంటనే అప్లై చేసుకోండిలా..
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కలతో ఉన్న నిరుద్యోగ యువతకు ఇది నిజంగా సువర్ణావకాశం. కేంద్ర రక్షణ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ, నేవీలతో పాటు సాయుధ సీమా బల్ (SSB), APSSBలలో ఏకంగా 3000 కు పైగా ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ (2026) లో వరుస నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. కేవలం 10వ తరగతి లేదా ఇంటర్ పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరి ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? లాస్ట్ డేట్ ఎప్పుడు? తదితర పూర్తి వివరాలు మీకోసం..
1. ఇండియన్ నేవీ అగ్నివీర్ (SSR & MR)
భారత నౌకాదళంలో అగ్నివీర్ పథకం కింద భారీగా పోస్టుల భర్తీ జరుగుతోంది.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి: బ్యాచ్‌ను బట్టి 2004 - 2009 మధ్య జన్మించి ఉండాలి.
చివరి తేదీ: 6 ఏప్రిల్ 2026.
ఎలా అప్లై చేయాలి: ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
2. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్
జనరల్ డ్యూటీ (GD), ట్రేడ్స్‌మ్యాన్, స్టోర్ కీపర్, టెక్నికల్ అసిస్టెంట్, నర్సింగ్, ఉమెన్ మిలిటరీ పోలీస్ లాంటి ఎన్నో పోస్టులకు ఆర్మీ దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పోస్టును బట్టి 8వ తరగతి, 10వ తరగతి లేదా ఇంటర్.
చివరి తేదీ: 10 ఏప్రిల్ 2026.
ఎలా అప్లై చేయాలి: ఆసక్తి గల అభ్యర్థులు joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
3. APSSB లో 984 పోస్టులు
అరుణాచల్ ప్రదేశ్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ (APSSB) నుండి కానిస్టేబుల్, ఫైర్‌మెన్, సివిల్ పోలీస్ విభాగాల్లో బంపర్ నోటిఫికేషన్ వచ్చింది.
అర్హత: కేవలం 10వ తరగతి పాస్.
చివరి తేదీ: 10 ఏప్రిల్ 2026.
ఎలా అప్లై చేయాలి: అభ్యర్థులు apssb.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
4. SSB లో కానిస్టేబుల్, డ్రైవర్ కొలువులు (800+ ఖాళీలు)
సాయుధ సీమా బల్ (SSB)లో టైలర్, వాషర్‌మ్యాన్, డ్రైవర్, వెయిటర్ తదితర విభాగాల్లో 800కి పైగా పోస్టులున్నాయి.
అర్హత: 10వ తరగతి లేదా టెన్త్ తో పాటు ఐటీఐ (ITI) పాసై ఉండాలి.
చివరి తేదీ: 20 ఏప్రిల్ 2026.
ఎలా అప్లై చేయాలి:ssb.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
5. ఇండియన్ నేవీ మ్యూజిషియన్ (MR)
సంగీతంపై ఆసక్తి ఉన్నవారికి నేవీలో చక్కటి అవకాశం.
అర్హత: కనీసం 50% మార్కులతో 10వ తరగతి పాస్ అవ్వాలి. అలాగే సంగీతంలో అనుభవం తప్పనిసరి.
చివరి తేదీ: 26 ఏప్రిల్ 2026.
ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష, మ్యూజిక్ ఎబిలిటీ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
గమనిక: గడువు దగ్గర పడుతుండటంతో సర్వర్లు బిజీగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

.webp)