ఉదయం నిద్ర లేవగానే వేడి వేడిగా టీ లేదా కాఫీ పడకపోతే చాలామందికి రోజు మొదలవ్వదు. కానీ, ఖాళీ కడుపుతో వీటిని తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వస్తాయని మీకు తెలుసా?
వాటికి బదులుగా ఉదయాన్నే ఒక గ్లాసు మజ్జిగ తాగితే మీ ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలిస్తే.. కచ్చితంగా ఆశ్చర్యపోతారు!
మజ్జిగలో పొటాషియం, క్యాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్‌తో పాటు మన పేగులకు మేలు చేసే 'ప్రొబయోటిక్ బ్యాక్టీరియా' పుష్కలంగా ఉంటుంది.
మరి ఏ సమస్యకు మజ్జిగను ఎలా తాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయో చూద్దాం..
బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా?: ఒక గ్లాసు మజ్జిగలో రెండు, మూడు కరివేపాకు ఆకులు, అర టీస్పూన్ మిరియాల పొడి కలుపుకుని తాగండి.
ఇది మీ శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
గ్యాస్, ఎసిడిటీకి చెక్: మజ్జిగలో ఉండే ప్రొబయోటిక్స్ వల్ల కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అల్సర్ వంటి సమస్యలు దరిచేరవు. పేగులు శుభ్రపడి మలబద్ధకం సమస్య దూరమవుతుంది.
అజీర్తి, విరేచనాలకు విరుగుడు: భారీగా భోజనం చేసిన తర్వాత పొట్టలో అసౌకర్యంగా ఉంటే.. మజ్జిగలో కాస్త అల్లం రసం కలుపుకుని తాగండి.
వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే, విరేచనాలతో బాధపడేవారు ఉదయాన్నే అల్లం రసం కలిపిన మజ్జిగ తాగితే వెంటనే తగ్గుముఖం పడతాయి.
బీపీ కంట్రోల్: హై-బీపీ (High BP) సమస్యతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ మజ్జిగ తాగడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
డీహైడ్రేషన్ దరిచేరదు: ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లే ముందు మజ్జిగ తాగితే.. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చల్లగా ఉంటుంది.
ఇంకెందుకు ఆలస్యం.. రేపటి నుంచే మీ దినచర్యను టీ, కాఫీలతో కాకుండా చల్లని, ఆరోగ్యకరమైన మజ్జిగతో మొదలుపెట్టి చూడండి! మీ ఆరోగ్యమే మారిపోతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

