వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల చాలామంది గొంతు గరగర, మొండి దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో చాలామంది వెంటనే మాత్రలు లేదా విక్స్ వంటివి వాడుతుంటారు.
అయితే వాటి వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలగవచ్చు. కానీ, మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన వస్తువులతోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యలన్నింటికీ సులభంగా చెక్ పెట్టవచ్చు. గొంతు ఇన్ఫెక్షన్‌ను తగ్గించి, ఉపశమనం కలిగించే ఒక అద్భుతమైన హోంమేడ్ టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పంచదార: 5 స్పూన్లు
నీరు: 1 గ్లాసు
బిర్యానీ ఆకులు: 2 (చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
మిరియాలు: 10
లవంగాలు: 10
తులసి ఆకులు: 10
అల్లం: చిన్న ముక్క
ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో 5 స్పూన్ల పంచదార వేయాలి. నీళ్లు పోయకుండా పంచదారను కలుపుతూ ఉంటే అది కరిగి గోధుమ రంగులోకి (క్యారమెల్) మారుతుంది.
పంచదార పూర్తిగా కరిగాక, అందులో ఒక గ్లాసు నీటిని జాగ్రత్తగా పోయాలి.
ఆ తర్వాత అందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన బిర్యానీ ఆకులను వేయాలి. (బిర్యానీ ఆకులు జలుబు, కఫం తగ్గించడానికి అద్భుతంగా సహాయపడతాయి).
ఇప్పుడు అందులోనే మిరియాలు, లవంగాలు, తులసి ఆకులు, కాస్త దంచిన అల్లం ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు తక్కువ మంటపై బాగా మరిగించాలి.
నీరు బాగా మరిగి, ఇంగ్రిడియంట్స్‌లోని రసం అంతా నీటిలోకి దిగాక స్టవ్ ఆఫ్ చేసి, ఆ నీటిని వడకట్టుకోవాలి.
ఈ హోంమేడ్ సిరప్ లేదా టీని ఒక గాజు సీసాలో పోసి నిల్వ చేసుకుంటే 3 రోజుల పాటు వాడుకోవచ్చు.
పెద్దలు: రోజుకు రెండుసార్లు (ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి) 2 స్పూన్ల చొప్పున తీసుకోవాలి.
పిల్లలు: రోజుకు రెండుసార్లు 1 స్పూన్ చొప్పున ఇస్తే సరిపోతుంది.
ఇందులో ఉపయోగించిన మిరియాలు, అల్లం, లవంగాలు గొంతులోని ఇన్ఫెక్షన్‌ను నయం చేయడంలో యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తాయి. తులసి ఆకులు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఈ రెమిడీని క్రమం తప్పకుండా మూడు రోజుల పాటు తీసుకుంటే గొంతులో పేరుకుపోయిన కఫం కరిగిపోయి, దగ్గు, జలుబు నుంచి పూర్తి ఉపశమనం లభిస్తుంది.
గమనిక: ఈ హోం రెమిడీ సాధారణ జలుబు, గొంతు నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

