మందార పూలను పూజలకే వాడుతున్నారా? వారానికి 2 సార్లు ఈ టీ తాగితే కలిగే అద్భుత లాభాలు ఇవే!

Mandara tea
మారిన జీవనశైలి, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఇంకొందరిలో వంశపారంపర్యంగా ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న పెద్ద సమస్య కొలెస్ట్రాల్. ఒకసారి కొలెస్ట్రాల్ పెరిగిందంటే, దాని వెంటే ఎన్నో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. 

దీన్ని అదుపులో ఉంచుకోవడానికి మనం రకరకాల మందులు, డైట్లు ప్రయత్నిస్తుంటాం. కానీ, మన ఇంటి పెరట్లోనే దొరికే మందార పువ్వు ఇందుకు అద్భుతంగా పనిచేస్తుందని చాలామందికి తెలియదు.

నిజం చెప్పాలంటే, ఒకప్పుడు నేను కూడా మా ఇంట్లో పూసే మందార పూలను కేవలం దేవుడి పూజకు లేదా జుట్టుకు రాసుకునే నూనెలో వేయడానికే వాడేదాన్ని. కానీ, ఈ మధ్య మందార టీ గురించి తెలిసి, దాన్ని ఇంట్లోనే తయారు చేసుకుని తాగడం మొదలుపెట్టాను. 

కేవలం రుచిగానే కాదు, అది తాగిన తర్వాత శరీరం చాలా తేలికగా, ఉత్సాహంగా అనిపిస్తోంది. కాస్త సమయం కేటాయించి చేసుకునే ఈ ఔషధ టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో నా అనుభవంతో పాటు మీతో పంచుకుంటున్నాను.

మందార టీ ఎలా తయారు చేసుకోవాలి?
దీన్ని తయారు చేసుకోవడం చాలా సులభం.ముందుగా తాజా మందార పువ్వులోని రేకలను తీసి నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి.

ముందుగా మరగబెట్టిన పాలు లేదా టీలో ఈ రేకలను వేయాలి.ఆ టీ రంగు పూర్తిగా మారేదాకా కాసేపు వేచి ఉండి, ఆ తర్వాత వడకట్టి గోరువెచ్చగా తాగాలి.

ఇలా తయారు చేసుకున్న టీలో అధిక శాతం ఐరన్, విటమిన్లు మరియు అనేక పోషక పదార్థాలు మన శరీరానికి నేరుగా అందుతాయి.

మందార టీ తాగడం వల్ల కలిగే అద్భుత లాభాలు
కొలెస్ట్రాల్ మరియు బిపికి చెక్: మందార టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాదు, హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) సమస్య ఉన్నవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

షుగర్ ఉన్నవారికి మేలు: రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మందార టీ బాగా సహాయపడుతుంది. అందుకే షుగర్ జబ్బు ఉన్నవారికి ఈ టీ చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతుంటారు.

కాలేయ ఆరోగ్యం మరియు జీర్ణక్రియ: ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన కాలేయాన్ని (లివర్) ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరిచి, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి.

ఒత్తిడికి దూరంగా: ఈ రోజుల్లో పని ఒత్తిడి వల్ల చాలామంది డిప్రెషన్‌కు గురవుతున్నారు. అలాంటి వారికి మందార టీ మనసును ప్రశాంతపరిచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

బరువు నియంత్రణ & మహిళల సమస్యలకు: బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి నేచురల్ డ్రింక్. ముఖ్యంగా మహిళలను వేధించే బహిష్టు నొప్పుల (పీరియడ్స్ పెయిన్) నివారణలో మందార టీ ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది.

వారానికి ఎన్నిసార్లు తాగాలి?
దీన్ని రోజూ కాకపోయినా, వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు తాగితే సరిపోతుంది. మన చుట్టూ సులభంగా దొరికే మందార పువ్వులతో, ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇన్ని ఆరోగ్య లాభాలను పొందవచ్చు. కాస్త శ్రద్ధ పెట్టి మీరు కూడా ఈ వారం నుండే మందార టీని ట్రై చేసి చూడండి, మార్పు మీకే తెలుస్తుంది!

గమనిక: ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

Source: telugulifestyle.com

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top