Tonsils



టాన్సిల్స్‌కుహోమియో చికిత్స  :

వ్యాధికారక క్రిములు, అలర్జీ కారక అణువులు గొంతు నుంచి ఛాతీలోనికి ప్రవేశించకుండా నిరోధించే ప్రక్రియలో టాన్సిల్స్ వాస్తాయి. ఈ వాపును టాన్సిలైటిస్, గవదకాయల శోదం అని అంటారు. దీనివల్ల గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు, ప్రతి పది, పదిహేనురోజులకొకసారి దగ్గు, జలుబు వస్తూ ఉంటుంది. గొంతునొప్పి ఒక్కోసారి చెవి వరకు విస్తరిస్తుంది. నోటిలో దుర్వాసన వస్తూ ఉంటుంది. గురక, నిద్రలో నోటితో గాలి పీల్చడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

టాన్సిలైటిస్ పిల్లల్లో సాధారణంగా కనిపించే సమస్య. ఒక్కోసారి పెద్దవాళ్లలో కూడా కనిపిస్తుంది. టాన్సిల్స్ రావడానికి ముఖ్య కారణం ఇన్‌ఫెక్షన్స్. స్ట్రెప్టోకోకస్ టవోజన్స్, హెచ్ ఇన్‌ప్లూయెంజ, స్ట్రెప్టోకోకస్ ఆరస్, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా వంటి బ్యాక్టీరియాల వల్ల టాన్సిల్స్ వచ్చే అవకాశం ఉంది. టాన్సిల్స్ వాపు బ్యాక్టీరియాపై ఆధారపడి ఉంటుంది.

హైపర్‌కెరటోసిస్, టాన్సిలోలిత్స్, కాన్‌డిడియాసిస్, సిఫిలిస్ వల్ల కూడా టాన్సిల్స్ ఇన్‌ఫెక్షన్ల బారినపడతాయి. దీర్ఘకాలిక టాన్సిల్స్ వాపు ఉంటే గొంతునొప్పి, నోటి దుర్వాసన, గురక ఎక్కువగా పెట్టడం కనిపిస్తుంది.

గొంతులో సప్తపద, అన్నవాహికలు కలిసే చోట రక్షకభటుల్లాగా ఉండి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తూ దేహరక్షణకు తోడ్పడే లింఫ్ కణజాల సమూహమును టాన్సిల్స్ అంటారు. ఇవి మూడు రకాలు. ఫారింజియల్ టాన్సిల్స్(అడినాయిడ్), ఫాలటైన్ టాన్సిల్స్, లింగ్వల్ టాన్సిల్స్.

టాన్సిల్స్ వాపు    :
 

వ్యాధికారక క్రిములు, అలర్జీ కారక అణువులు గొంతు నుంచి ఛాతీలోనికి ప్రవేశించకుండా నిరోధించే ప్రక్రియలో టాన్సిల్స్‌లో వాపు వస్తుంది. ఈ వాపును టాన్సిలైటిస్, గవదకాయల శోదం అని అంటారు. దీనివల్ల గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

తరచుగా బాధిస్తుంటే క్రానిక్ టాన్సిలైటిస్ అని, ఎక్యూట్ టాన్సిలైటిస్ అని రెండు రకాల టాన్సిల్స్‌ను గమనించవచ్చు. ఎక్యూట్ టాన్సిలైటిస్ బ్యాక్టీరియా, వైరస్ సంక్రమణం వల్ల వస్తుంది. దీనికి సరైన చికిత్స అందకపోతే దీర్ఘకాలంపాటు వేధిస్తుంది. బ్యాక్టీరియా కారణంగా వచ్చే దీర్ఘకాలిక టాన్సిలైటిస్‌లో టాన్సిల్స్‌పై చీము కూడా కనిపిస్తుంది.

ఎక్యూట్ టాన్సిలైటిస్ లక్షణాలు    :
 

  •  ప్రతి పది, పదిహేనురోజులకొకసారి దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తాయి. వీటితోపాటు జ్వరం కూడా ఉంటుంది.
  •   గొంతునొప్పి ఉంటుంది. ఒక్కోసారి నొప్పి చెవి వరకు విస్తరిస్తుంది.
  •   నోటిలో దుర్వాసన వస్తూ ఉంటుంది.
  •   గురక, నిద్రలో నోటితో గాలిపీల్చడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

క్రానిక్ టాన్సిలైటిస్ లక్షణాలు    :
 

  •  తరచుగా దగ్గు రావడం.
  •   సైనుసైటిస్,బ్రాంకైటిస్, బ్రాంకియల్ ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు.
  •   శరీరపెరుగుదల లోపించడం, ఎప్పుడూ అనారోగ్యంగా ఉండటం.
  • ఆహారం మింగడం కష్టమవడం, మాట్లాడలేకపోవడం.
  •   మెడ భాగంలోని లింఫ్ గ్రంథులు వాయడం వంటి లక్షణాలు ఉంటాయి.

చికిత్స     :
 

ముందుగా గొంతు నొప్పి, జ్వరంను తగ్గించే మందులు వాడాల్సి ఉంటుంది. వీటితోపాటు ఇన్‌ఫెక్షన్లను అదుపు చేయుటకు యాంటీబయోటిక్స్‌ను ఉపయోగించాలి. తరచుగా టాన్సిల్స్ వాస్తూ దీర్ఘకాలం పాటు బాధిస్తూ, శరీర ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతూ ఉంటే శస్త్రచికిత్స ద్వారా టాన్సిల్స్‌ను తొలగించాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్సను టాన్సిలెక్టమీ అంటారు. ఇటీవల ఆధునిక వైద్యులు కూడా దేహరక్షణలో టాన్సిల్స్ పాత్రను గుర్తించి టాన్సిలెక్టమీ సర్జరీకంటే ముందుగా హోమియో మందులు వాడమని సూచిస్తున్నారు.

హోమియో మందుల పనితీరు    :
 

  • హోమియో మందుల వల్ల వాచిన టాన్సిల్స్ వాపు తగ్గి సాధారణ పరిమాణంకు వస్తాయి.
  • అనారోగ్య టాన్సిల్స్ సాధారణ స్థితికి చేరుకొని సమర్థవంతంగా దేహరక్షణకు తోడ్పడతాయి
  • తరచుగా జలుబు, గొంతునొప్పి, జ్వరం రాకుండా శరీరంలో రోగనిరోధకశక్తి పెంపొందుతుంది.
  •   బ్రాంకైటిస్, సైనస్‌ల వాపు తగ్గిపోతుంది. ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు రాకుండా నిరోధింపబడతాయి.
  •   శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top