Savasan


ఉదయం యోగాసనాలతో మాత్రమే కాదు, రాత్రి పడుకోబోయే ముందు కూడా శవాసనం వేయవచ్చు. ఆ సమయంలో అప్పుడు ఆచరించడం వలన శరీరం, మనస్సు పూర్తిగా విశ్రాంతి పొందుతాయి.మనస్సు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది.ఈ ఆసనం ఆచరించే సమయంలో మనసు, శరీరం కల్లోలంలో ఉండరాదు. మనస్సును చేసే పనిమీద కేంద్రీకరించాలి. ఒత్తిడితో కూడిన మనస్సుకు విశ్రాంతి అవసరం అయినప్పుడు ఈ శవాసనం అమితంగా ఉపయోగపడుతుంది.

ఆసనం వేసే పద్ధతి :
కాళ్ళు రెండూ ఒకటి లేదా రెండడుగులు వెడల్పు చేయాలి. బొటనవేళ్ళు రెండు బయటకు చూస్తున్నట్టుగా కాళ్ళు ఉంచాలి. మడమలు రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. మనకు విశ్రాంతిగా హాయిగా ఉంటుందనుకున్నంతవరకు కాళ్ళు పెట్టవలసిన వెడల్పును నిర్ణయించుకోవచ్చు. రెండు చేతులూ శరీరానికి కొంచెం దూరంగా అరచేతులు పైకి కనిపించేలా ఉంచాలి. ఏవైపు అయితే హాయిగా ఉంటుందో ఈ వైపునకు మెడను తిప్పి ఉంచాలి.

ప్రయోజనాలు :
మహిళలకు రుతుస్రావం సమయంలో ప్రయోజనం కలిగిస్తుంది. కండరాలకు గాఢంగా విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. మెదడు బాగా విశ్రమిస్తుంది. ఈ సమయంలో మహిళలు ఉద్రేకంగా, వేదనగా, కోపంగా, చికాకుగా,దిగులుగా, ఆందోళనగా, అలసిపోయినట్టుగా లేదా మానసిక ఒత్తిడికి లోనైనట్టుగా ఉన్నప్పుడు శవాసనం ఎంతో ఉపకారిగా ఉంటుంది. కండరాలు విశ్రాంతి పొంది, మనస్సుపై కేంద్రీకరించి ఆందోళనలు, చికాకుల నుంచి పూర్తి ఉపశమనం కల్పిస్తుంది.తిరిగి శక్తి పుంజుకుని ప్రశాంతతను, తాజాదనాన్ని ఇస్తుంది.

లాభాలు : 

వీపు వెనుక లేదా దిగువ భాగాన లేదా పొత్తికడుపున నొప్పి ఉన్నట్ల యితే... శవాసనం ఉపశమనం కల్పిస్తుంది. నిరంతరం పనుల ఒత్తిడితో అలసటకు గురైన భాగాలపై మనస్సు కేంద్రీకరించడం, ఆయా భాగాలకు విశ్రాంతి కలిగించడం వంటివి చేయవచ్చు. నొప్పు ల నుంచి ఉపశమనం ఉంటుంది. గర్భం ధరించిన సమయంలో పగటిపూట ఎప్పుడైనా అలసట అనిపించినప్పుడు లేదా ఆందోళనగా ఉన్నప్పుడు శవాసనం శరీర మతుల్యతకు దోహదం చేస్తుంది. శరీరంలోని అన్ని వ్యవస్థలు విశ్రాంతిపొందుతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top