చిరంజీవి, మోహన్ బాబులలో టామ్ ఎవరు..జెర్రీ ఎవరు?

మోహన్ బాబు, చిరంజీవిలు కలిసి మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసారు. అయితే ఇద్దరిలో ఎవరు టామ్...ఎవరు జెర్రి అనేది అన్ని చోట్లా హాట్ టాపిక్ గా మారింది. మోహన్‌ బాబు నెలకొల్పిన శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవం ఆయన జన్మదినోత్సవం తిరుపతికి సమీపంలోని శ్రీరంగంపేటలో జరిగినప్పుడు ఈ వేడుకలకు హాజరైన చిరంజీవి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..'మోహన్‌బాబుతో నా అనుబంధం 30 ఏళ్లు. మనిషి మాట కరుకు అయినా మనసు చెరకు. అతనితో స్నేహం ఏర్పడితే ఆ బంధం నుంచి ఎవరూ బయటకి పోలేరు. ఆయన కష్టజీవి. శ్రమతో ఈ స్థాయికి వచ్చాడు. ఎవరో అన్నారు ఈ మధ్య మా అనుబంధం గురించి.. టామ్ అండ్ జెర్రీ అని. అవును నిజమే. ఒకర్ని మంచి ఒకరు అలా ఉండాలి అని. తెలుగువాడు ఎక్కడున్నా గర్వించేలా ఈ విద్యాసంస్థలను మోహన్‌బాబు నెలకొల్పాడు. నటుడుగా లభించే తృప్తి కన్నా విద్యాసంస్థల అధినేతగా ఆయన పొందే అనుభూతి, తృప్తి ఎక్కువ' అన్నారు చిరంజీవి. మోహన్‌బాబు మాట్లాడుతూ 'చిరంజీవితో నా స్నేహం మరువలేనిది. మధ్యలో కొందరు మనస్పర్థలు తెచ్చిపెట్టినా అది వాళ్లకే నష్టం కానీ మా ఇద్దరికీ ఏం కాదు. మంచి నటుడు, మంచి మనిషి చిరంజీవి' అన్నారు. ఇంతకీ ఇద్దరిలో టామ్ ఎవరు..జెర్రీ ఎవరంటారు.
Share on Google Plus