కోపం రాకుండా ఉండాలంటే.....

కొన్ని సందర్భాలలో కోపాన్ని నియంత్రించుకోవాలని చూసినా సాధ్యం కాదు. కారణం ఆ కోపానికి కారణమవుతున్న వ్యక్తి ప్రవర్తన. అలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో చూడండి.

  • సెన్సాఫ్ హ్యూమర్‌ను డెవలప్ చేసుకోండి. మీ కోపానికి కారణమవుతున్న వ్యక్తి తారసపడినపుడు ఇది బాగా పనిచేస్తుంది.
  •   సహనం కోల్పోకండి. మృదువుగా మాట్లాడండి. తప్పనిసరిగా నేను చెప్పింది వినాల్సిందేనని బలవంతపెట్టినా శాంతంగా ఉండండి. మీరు మాట్లాడేది వినడానికి ఇష్టం లేకపోయినా సాఫ్ట్‌గానే మాట్లాడండి.
  • ఒకవేళ అటువంటి వ్యక్తితో వేగలేకపోతున్నట్లయితే అతనికి దూరంగా ఉండండి.
  •   అతనిలోని నెగెటివ్ అంశాలను కాకుండా పాజిటివ్ అంశాలను చూడండి. ఆ వ్యక్తిలోని నెగెటివ్ అంశాల గురించి కాకుండా పాజిటివ్ అంశాలపై మాట్లాడండి. ఇది తప్పక ఫలితానిస్తుంది.
  • ఎదుటి వ్యక్తి విమర్శిస్తున్నట్లయితే వాటిని సహృదయంతో స్వీకరించండి.

Share on Google Plus