కూరగాయల పిజా



కావల్సినవి: క్యాప్సికం, టమాటాలు- పావుకేజీ, ఉల్లిపాయలు- మూడు, పిజా బేస్‌లు- నాలుగు, వెన్న- నాలుగు చెంచాలు, చీజ్‌ తురుము- కొద్దిగా, మిరియాలపొడి- చెంచా, టమాటాసాస్‌- ఎనిమిది చెంచాలు, చిల్లీసాస్‌- మూడు చెంచాలు, ఉప్పు- రుచికి తగినంత, నూనె- మూడుచెంచాలు.

తయారీ: క్యాప్సికం ముక్కలు తరిగి పక్కనపెట్టుకోవాలి. తరవాత బాణలిలో చెంచా వెన్న వేసి వేడయ్యాక క్యాప్సికం ముక్కలు వేయాలి. కొద్దిసేపటికి ఉప్పు, టమాటాసాస్‌, చిల్లీసాస్‌ కలిపి దించేయాలి చల్లారాక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో బాణలిలో వెన్నను కరిగించి ఉల్లిపాయ ముక్కలు వేయించి.. ఉప్పు కలిపి దించేయాలి. అలానే టమాటాలను కోసి రసం పిండి ముక్కలను కోసి ఉంచుకోవాలి. తరవాత సిద్ధంగా  పెట్టుకున్న పదార్థాలన్నీ కలపాలి. తరవాత పిజా బేస్‌ పైన వెన్న, టమాటాసాస్‌ రాసి కూరగాయల మిశ్రమం పరచాలి. ఆపైన చీజ్‌తరుముతో అలంకరించుకుంటే కూరగాయల పిజా సిద్ధమయినట్టే. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top