చనా పులావ్‌

కావలసినవి: 

బాస్మతి బియ్యం : 2 కప్పులు
టమోటాలు : 3
పుదీనా ఆకులు : 10
నెయ్యి : 2 టీ స్పూన్స్‌
యాలకులు : 3
లవంగాలు : 4
కాబులి శనగలు : 1 కప్పు
కొబ్బరిపాలు : 1 కప్పు
నూనె : 3 టీ స్పూన్స్‌
పచ్చిమిరప కాయలు : 4
కొత్తిమీర : 2 టీ స్పూన్స్‌
గరం మసాల పొడి : ఆర టీస్పూన్‌.
దాల్చిన చెక్క : 1 ముక్క
షాజీర : ఆర టీ స్పూన్‌.

తయారు చేయు విధానం
ముందుగా శనగలను రాత్రి పూట నానబెట్టాలి. వీటిని కుక్కర్‌లో ఉడికించాలి. బియ్యాన్ని కడిగి పది నిమిషాల పాటు నీళ్ళలో నానపెటాల్సి ఉంటుంది. టమాటాలను సన్నగా తరిగి మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్‌ వెలిగించి మందపాటి గిన్నె తీసుకుని అందులో నూనె, నెయ్యి వేయాలి. ఇది వేడి అయ్యాక అందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా వేసి కొద్దిగా వేయించాలి. తరువాత పుదీనా ఆకులు, టమాట ముద్ద వేసి కలిపి వేయించాలి.

తరువాత ఉడికించిన శనగలు, చిటికెడు పంచదార వేసి అన్ని కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇందులో కొబ్బరి పాలు, నీళ్ళు పోయాలి (1 గ్లాసు బియ్యానికి 1 1/2 కొలతతో నీళ్ళు పోయాలి) తరువాత ఉప్పు వేసి బాగా కలిపి మరిగించాలి. మరుగతున్నప్పుడే బియ్యం వేసి నిదానంగా ఉడికించాలి. నీరంతా ఇగిరిపోయాక గిన్నె కింద పెనం పెట్టి పైన మూతపెట్టేయాలి. పూర్తిగా తయారయ్యాక పై నుండి కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే చనా పులావ్‌ తయార్‌..... .

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top