వర్షాకాలంలో తీసుకోవలసిన ఆహారం

మంచి నీటిని ఎక్కువగాతాగాలి.శరీరబరువుకు తగ్గట్టు ఫ్లూయిడ్స్‌ తీసుకోవాలి. ఉదాహరణకు 80 కేజీల బరువున్న వాళ్లు 40 ఔన్సుల ఫ్లూయిడ్స్‌ అంటే 1200 ఎంఎల్‌ ఫ్లూయిడ్స్‌ తీసుకోవాలి.

మంచినీళ్లు ఎంత తాగితే అంత మంచిది.

పళ్లు తోముకున్న వెంటనే గోరువెచ్చని నీటితో నోటిని పుక్కిలించి మంచినీళ్లు తాగాలి. ఆ తర్వాత నానబెట్టిన పది

బాదం పప్పులు తినాలి. ఎండిన రెండు అంజీరాలు కూడా తినాలి.

బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఒక గ్లాసుడు కమలాపండురసం తీసుకోవాలి. అలాగే ఒక టీ స్పూను అల్లం జ్యూసు కూడా తాగాలి.

మధ్యాహ్నం పూట క్యాబేజీ సూప్‌లో మిరియాలు, అల్లం దంచి ఆ పొడిని కలుపుకుని తాగాలి.

లంచ్‌ తర్వాత అల్లం నీటిలో నానబెట్టిన పుచ్చకాయముక్కలను కాస్త మిరియాల పొడి చల్లుకుని తినాలి. పాలకూరలాంటి ఆకుకూరలతో తయారు చేసిన సూప్‌ తీసుకోవాలి.

Diet and Nutritional Tips to Stay Healthy in Monsoon Season

సాయంత్రంబాదంపప్పులు, వాల్‌నట్స్‌, జీడిపప్పులు, సన్‌ఫ్లవర్‌ విత్తనాలను కలిపి రోస్టు చేసి స్నాక్‌లా తీసుకోవాలి. కాస్త రుచిగా తినాలనుకుంటే వీటికి కొద్దిగా కారం, మిరియాలపొడి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టొమాటోలు చేర్చి అందులో కాస్త ఉప్పు కలిపి స్నాక్‌లా తినొచ్చు.

ఆ తర్వాత అల్లం వేసిన గ్రీన్‌ టీ లేదా నిమ్మకాయ టీ తాగాలి.

డిన్నర్‌తోబాటు అల్లం, మిరియాలపొడి, సన్‌ఫ్లవర్‌ విత్తనాలు మెత్తగా దంచి ఆ మిశ్రమాన్ని క్యారెట్‌ జ్యూసులో కలుపుకుని తాగితే మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top