శీతాకాలంలో వచ్చే దగ్గు, జలుబుకు చిట్కాలు

శీతాకాలంలో జలుబుతో పాటు దగ్గు రావటం ఆలస్యం....... మందుల షాప్ కి వెళ్లి ఏదో దగ్గు మందు తీసుకుంటాం. వాటి వల్ల దగ్గు తగ్గటం అలా ఉంచితే... అతినిద్ర, ఆకలి మందగించటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అవి రాకుండా మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే తేనెతో రకరకాల చికిత్సలను చేసుకోవచ్చు.

దగ్గుకు తేనేని మించిన మందు లేదని పరిశోదకులు చెప్పుతున్నారు. తేనేలో ఏమి కలపకుండా నేరుగా తీసుకుంటే గొంతు లోపల ఓ పూతలా ఏర్పడి గరగరని,మంటని తగ్గిస్తుంది. తెనేకి కాస్త నిమ్మరసం కలిపి తీసుకుంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

అల్లం టీ కూడా దగ్గుకు మంచి ఔషదమే. అల్లాన్ని పది చిన్న చిన్న ముక్కలుగా కోసి, మూడు కప్పుల నీటిలో ఇరవై నిముషాలు వేడి చేయండి. కాస్త చల్లారాక ఒక స్పూన్ తేనే కలపాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ రెండు చెక్కలను పిండి, రెండు పూటల త్రాగితే మంచి పలితం కనపడుతుంది.


Health tips in common cold in telugu

ఒక స్పూన్ నల్ల మిరియాలకు ఒక స్పూన్ తేనే కలపండి. దీనిలో వేడి నీరు పోసి మూత పెట్టండి. ఒక పావుగంట తర్వాత త్రాగితే మంచి పలితం ఉంటుంది. అలాగే ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ పసుపు,ఒక స్పూన్ వాము వేసి వేడి చేయండి. నీరు సగానికి అయ్యే వరకు మరిగించండి. దీనికి తేనే కలిపి రోజులో మూడు పూటల త్రాగితే మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top