రమ్య కృష్ణ జీవితం గురించి తెలియని షాకింగ్ నిజాలు

Ramya krishna సెప్టెంబర్ 15, 1967 చెన్నై, తమిళనాడులో జన్మించింది. ఆమె 200 పైగా సినిమాల్లో  నటించింది.ఆమె  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 
నటించడం ద్వారా ఆమె ఒక అరుదైన రికార్డు సృష్టించారు.

ఆమె ఒక గ్లామర్ డాల్ గా, కేరింగ్ భార్యగా , అంకితభావం గల తల్లిగా,ఒక దురహంకారపు అమ్మాయిగా అనేక చాలేజింగ్ రోల్స్ లో నటించి మెప్పించింది రమ్యక్రిష్ణన్. ఆమె ‘కూచిపూడి’, ‘భరతనాట్యం’ నేర్చుకొని అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఆమె ప్రముఖ తమిళ హాస్యనటుడు ‘చో రామస్వామి’ మేనకోడలు.

CLICKHERE : రాత్రి పడుకొనే ముందు బ్రష్ చేయటం అవసరమా?

ఆమె తెలుగు సినిమా దర్శకుడు ‘కృష్ణ వంశీ’ని జూన్ 12, 2003న వివాహం చేసుకుంది.రమ్య కృష్ణన్ దంపతులకు ‘రిత్విక్’ అనే కుమారుడు వున్నాడు . రమ్య కృష్ణ 13 సంవత్సరాల వయస్సులో ఆమె నటనను ప్రారంభించింది. ఆమె తన మొదటి సినిమా తమిళంలో ‘Y.G.మహేంద్రన్ ‘సరసన ‘వెల్లై మనసు’ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. 

Ramya Krishna Unknown facts in Telugulifestyle


ఆమె తన మొదటి Movie లో నటించినప్పుడు ఆమె 8 వ తరగతి చదువుతుంది. Ramya krishna తెలుగులో నటించిన మొదటి సినిమా ‘భలే మిత్రులు’.తన First  తెలుగు సినిమా ‘భలే మిత్రులు’ అయినప్పటికీ కూడా కాశీనాథ్ విశ్వనాథ్ రచనలో 1987 వ సంవత్సరంలో వచ్చిన  సూత్రదారులు సినిమాతో ఒక నటిగా రమ్యకృష్ణకు మొదటి Break  వచ్చింది. 

Tollywood  టాప్ డైరెక్టర్ K.రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ‘స్టార్’ గా ఎదిగింది. ఒక దక్షిణ భారత నటి రెండు దశాబ్దాల పాటు తన ఖాతాలో 200 పైగా చిత్రాలలో నటించడం ఒక విశేషం.

CLICKHERE : జ్యుస్ త్రాగటం మంచిదా? పండు తినటం మంచిదా?

ఆమె చిరంజీవి, బాలకృష్ణ నందమూరి, వెంకటేష్, నాగార్జున, జగపతి బాబు వంటి  హీరోలతోనే కాకుండా అక్కినేని నాగేశ్వర రావు, నందమూరి తారక రామారావు, కృష్ణ, శోబన్ బాబు వంటి నిన్నటి తరం హీరోలతో కూడా పనిచేసిన అనుభవం రమ్యకృష్ణది. ఆమె తమిళ చిత్రం Padayappa(తెలుగులో నరసింహ) South India తో పాటు అంతర్జాతీయంగా Japan , సింగపూర్, London మరియు పారిస్ లో కూడా విడుదల అయ్యి రమ్యకృష్ణ కు జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది.


నరసింహ సినిమాలో తన విలనిజాన్ని ఒక కొత్త కోణంలో చూపెట్టి రాబోవు తరాల హీరోయిన్ లకు విలన్ కారెక్టర్ కావాలంటే ఆ సినిమాలో రమ్య కృష్ణన్ ల వుండాలని కోరుకుంటారు.ఉత్తమ నటిగా 1998 లో వచ్చిన కంటే కూతురినే కనాలి సినిమా ద్వారా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు దక్కించుకుంది.రమ్య కృష్ణ Thanga vettai (గోల్డ్ హంట్) అనే గేమ్ షో sun tv లో కనిపించారు.రమ్య తన కుమారుడు ‘రిత్విక్’ పేరిట కంపెనీ ప్రారంభించింది.


రమ్య కృష్ణన్ ఇప్పుడు బాహుబలి ది బిగేనింగ్ సినిమాతో మరోసారి తన సత్తా నిరుపించుకున్నారు. ఈ సినిమాలోని తన నటనకు ఇండియన్ సిల్వర్ స్క్రిన్ పై తన నట విశ్వరుపంతో మరోసారి తనకు సాటి ఎవరూ లేరని నిరూపించుకుంది. ప్రస్తుతం బాహుబలి రెండో భాగంతో బిజీగా ఉంది. 



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top