నాగార్జున పెట్టిన కండిషన్స్ కి సమంతా ఒకేనా ....???

ప్రేమలో గెలవాలంటే తప్పనిసరిగా కొన్నింటిని వదులుకోవాలి. అలా వదులుకోకపోతే ప్రేమలో విఫలం అవటం ఖాయం. సమంతా మనస్సుకు నచ్చిన వాడితో వివాహ బంధాన్ని ముడి వేసుకోవటానికి నటనకు గుడ్ బై చెప్పేయటానికి నిర్ణయం తీసుకుంది. 

నాగ చైతన్యతో ప్రేమలో పడి, అది పెళ్లి వరకు వచ్చే సమయానికి నాగ చైతన్య తండ్రి నాగార్జున పెట్టిన కండిషన్స్ కి ఒప్పుకుందని సమాచారం. నాగార్జున పెళ్లి అయ్యాక ఇంటికే పరిమితం అవ్వాలని సినిమాలు చేయకూడదని కండిషన్ పెట్టాడట. 

Samantha says goodbye to movies

అంతేకాక కోలీవుడ్ లో ధనుష్ తో ఒక సినిమా చేయటానికి సమంతా కమిట్ అయ్యింది. దానికి సంబంధించి అడ్వాన్స్ చెక్ కూడా తిరిగి ఇచ్చేయాలని నాగ్ కండిషన్ పెట్టాడు. దాంతో సమంతా తన ప్రొఫెషన్ కన్నా జీవితం ముఖ్యమని భావించి నాగార్జున చెప్పిన కండిషన్స్ కి ఒకే చెప్పిందట. 


కల్యాణకృష్ణ దర్శకత్వం లో చైతన్య ,సమంతా కలిసి నటిస్తున్నారు.ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారం చూస్తే సమంతా ఆఖరు సినిమా ఇదే అవుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ విషయంపై అక్కినేని కుటుంబం కానీ సమంతా కానీ క్లారిటీ ఇస్తే కానీ ఇటువంటి ఊహాగాణాలకు బ్రేక్ పడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top