విజయ శాంతి జీవితం గురించి తెలియని షాకింగ్ నిజాలు

విజయ శాంతి జూన్ 24,1966 వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లో జన్మించింది. ఆమె తల్లితండ్రులు వరంగల్ జిల్లా వాసులు. ఆమె అసలు పేరు శాంతి. సినిమాల్లోకి వచ్చాక విజయశాంతిగా మార్చుకుంది. విజయశాంతి ప్రాధమిక విద్య చెన్నై లోని హోలీ ఏంజెల్స్ హై స్కూల్ లో జరిగింది.

విజయశాంతి తెలుగు, మలయాళం,తమిళం, కన్నడ మరియు హిందీతో సహా ఏడు భాషలలో 185 సినిమాలకు పైగా నటించింది. ఆమె లేడి 'అమితాబ్' గా పేరు తెచ్చుకుంది. 

భారతి రాజా దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా 'కల్లుక్కుళ్' అనే తమిళ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన 'కిలాడి కృష్ణుడు' సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టింది. 


CLICKHERE : మెడ మీద ఏర్పడిన నలుపు పోవాలంటే....


ఆమె కెరీర్ మొదట్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలను పోషించింది. అయితే ఆమెకు 1983 లో వచ్చిన 'నేటి భారతం' మంచి బ్రేక్ ని ఇచ్చింది. దాంతో కొంత కాలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేసింది. ఆ తర్వాత 1990 లో వచ్చిన యాక్షన్ మరియు మాస్ ఎంటర్టైనర్ 'కర్తవ్యం' సినిమా విజయశాంతిని గ్లామర్ నుంచి యాక్షన్ కి వైపుకి తిప్పింది.

 'కర్తవ్యం' సినిమాకు ఉత్తమ నటిగా నేషనల్ ఫిలిం అవార్డు తీసుకుంది. ఆమెకు సినిమా పరిశ్రమ లో అత్యంత సన్నిహితులు సుహాసిని మణిరత్నం, రాధ మాత్రమే.

CLICKHERE : తిరుపతి లడ్డూ ఫార్ములా తెలుసా


ఆమె రాజకీయ జీవితాన్ని 1997 లో బీజేపీలో చేరి ప్రారంభించింది.ఆమె వెంటనే బిజెపి మహిళా విభాగం(భారతీయ మహిళా మోర్చా) కార్యదర్శి అయ్యారు. ఆమె జనవరి 2009 లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీలో చేరారు. 

ఆమె రాజకీయ జీవితంపై దృష్టి సారించడంతో 1999 నుండి ఆమె సినిమాలను చేయటం తగ్గించింది. 15 వ లోక్ సభ జనరల్ ఎలక్షన్, 2009 లో ఆమె మెదక్ సీటు గెలుచుకున్నారు. 2014 ఎన్నికలలో పోటి చేసి ఓడిపోయారు.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top