ఉప్పు ఎంత మాయ చేస్తుందో తెలుసా

ఉప్పు వాడకం ఎక్కువైతే బిపి వస్తుందని అంటారు...అయితే ఉప్పు లేకుండా ఏమి తినలేము. వంటకంలో ఉప్పు సరైన మోతాదులో పడకపోతే ఆ వంటకానికి రుచే ఉండదు. ఉప్పు వంటల్లోనే కాకుండా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం.

CLICKHERE : మహేష్ అలవాట్లపై షాకింగ్ నిజాలు

* మీ ఇంట్లోని త‌లుపులు, కిటికీలు, షెల్ప్‌ల వంటి ప్ర‌దేశాల్లో కొంచెం ఉప్పును చల్లితే చీమ‌లు రావు. అంతేకాక ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో తేమ తగ్గి పొడిగా మారుతుంది.

* కొంచెం యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ లో చిటికెడు ఉప్పు కలిపి రాగి, వెండి, ఇత్త‌డి పాత్ర‌ల‌ను తోమితే అవి త‌ళ‌త‌ళా మెరుస్తాయి.

* రెండు, మూడు టేబుల్ స్పూన్ల ఉప్పును 3.5 లీట‌ర్ల గోరు వెచ్చని నీటిలో వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్రామాన్ని ఉప‌యోగించి కిటికీలు, తలుపులు, గ్లాస్ విండోస్‌, కార్ విండోస్‌ వంటివి శుభ్రం చేస్తే.... స్ప్రే అవసరం లేకుండానే శుభ్రపడతాయి.
CLICKHERE : ఒలింపిక్స్ లో క్రికెట్ ఎందుకు.....ఉండదు?


* వేడి వేడి నీటిలో గుప్పెడు ఉప్పు వేసి కిచెన్ సింక్‌ ను శుభ్రం చేస్తే అందులో జామ్ అయిన చెత్త పోతుంది.

* కొద్దిగా ఉప్పును, ల‌వంగ నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ తో బాగా క‌లిపి శ‌రీరానికి రాయాలి. కొంచెం సేపు అయ్యిన తర్వాత స్నానం చేస్తే చ‌ర్మంపై పేరుకున్న మొత్తం మురికి పోయి శ‌రీరం కాంతివంతంగా మారుతుంది.

* కార్పెట్లు, దుప్ప‌ట్లు, దుస్తులపై ప‌డ్డ మ‌ర‌కల‌ను తొలగించడానికి... కొంత నీటిలో ఉప్పును వేసి బాగా క‌లిపి, ఆ నీటిలో ముంచిన క్లాత్ తో తుడిస్తే సరిపోతుంది. దీంతో ఆ మర‌క‌లు ఇట్టే తొల‌గిపోతాయి.

CLICKHERE : తొడలు రాసుకుని ఎర్రగా కందితే...ఏమి చేయాలి?
* ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి ఆ నీటిని 1 నిమిషం పుక్కిలించాలి. విధంగా చేయటం వలన దంతాల నొప్పి, నోటి పూత వంటి సమస్యలు తగ్గుతాయి. 

* బేకింగ్ సోడ, ఉప్పును స‌మాన భాగాల్లో తీసుకుని కొంత నీటికి కలిపి పేస్ట్‌లా చేసి దాంతో ప‌ళ్లు తోముకుంటే ప‌ళ్లు మిల‌మిలా మెరుస్తాయి.
* దుస్తుల‌ను డిట‌ర్జెంట్ లేదా స‌బ్బుతో ఉతికిన త‌రువాత నీటిలో కొద్దిగా ఉప్పును వేసి ఆ నీటిలో దుస్తుల‌ను ముంచి తీస్తే దుస్తులు ష్రింక్ అవ్వకుండా ఉంటాయి. దీనికి తోడు బ‌ట్ట‌లు శుభ్రంగా, మృదువుగా మారుతాయి.

CLICKHERE : మంచు లక్ష్మి పెళ్లి ఎలా జరిగిందో....తెలుసా?

CLICKHERE : మీ వేలిముద్రతో మీ క్యారక్టర్ తెలుసుకోవటం ఎలా?Share on Google Plus