ఫోన్ నీటిలో పడిందా.... అయితే దీన్ని ఫాలో అవండి

ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్మార్ట్‌ఫోన్ నీళ్లలో పడితే..? ఇంకేముంది! అంతా అయిపోయింది. అంటూ చాలా మంది కంగారు పడతారు. అయితే నీటిలో ఫోన్ పడగానే కంగారు పడకుండా, ఎటువంటి ఆందోళన చెందకుండా కింద పేర్కొన్న విధంగా చేస్తే అధిక శాతం వరకు ఎలాంటి రిపేర్ చేయకుండానే డివైస్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

CLICKHERE : మనం కొనే మందులు అసలైనవా...నకిలీవా....ఎలా తెలుసుకోవాలి?


1. నీటిలో పడ్డ ఫోన్‌ను తీసిన వెంటనే ఆన్ చేయకూడదు. ఫోన్‌పై ఉండే బటన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెస్ చేయకూడదు.

2. ఫోన్‌ను ఊపడం, విసరడం వంటివి చేయకూడదు. ఏం తెలియకుండా ఫోన్ పార్ట్స్‌ను విడదీయకూడదు.

3. లోపల నీరు చేరిందేమోనని నోటితో గాలిని ఊదకూడదు. ఇలా చేస్తే నీరు డివైస్‌లోని సున్నితమైన ప్రదేశాల్లోకి వెళ్లి మరింత డ్యామేజ్‌కు గురి చేస్తుంది.

CLICKHERE : భామల రేటు చూస్తే... షాక్ అవ్వాల్సిందే


4. ఏ పద్ధతిలోనూ ఫోన్‌ను హీట్ చేయకూడదు.

5. నీటిలో పడినప్పటికీ ఇంకా ఆన్‌లోనే ఉంటే ఫోన్‌ను వెంటనే ఆఫ్ చేసేయాలి.

6. ఫ్లిప్ కవర్/బ్యాక్ కేస్, సిమ్, మెమోరీ కార్డు, బ్యాటరీలను తీయాలి.

7. పొడి గుడ్డ లేదా పేపర్ టవల్‌తో ఫోన్ డ్రై అయ్యేంత వరకు తుడవాలి. ఫోన్‌లో ఇతర ప్రదేశాలకు నీరు వెళ్లకుండా జాగ్రత్తగా పట్టుకుని ఈ పని చేయాలి.

CLICKHERE : ఇది చదివితే బంగారు ఉంగరాలు తీసేస్తారు


8. బయటికి రాని నీటిని వాక్యూమ్ సహాయంతో తీసేయాలి.

9. కవర్ చేయబడి ఉన్న సంచిలోని బియ్యంలో ఫోన్‌ను పూర్తిగా కప్పాలి. ద్రవాలను పీల్చుకునే శక్తి బియ్యానికి ఎక్కువగా ఉంది. అందుకే ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది.

10. ఒకటి లేదా రెండు రోజుల పాటు ఫోన్‌ను అలాగే ఉంచాలి. అనంతరం తీసి ఎప్పటిలాగే ఉపయోగించవచ్చు. అయినప్పటికీ ఫోన్ ఆన్ కాకపోతే ముందు చార్జింగ్ కానివ్వాలి. తర్వాత కూడా ఆన్ కానట్టయితే బ్యాటరీ మార్చి చూడవచ్చు. 

ఫలితం లేకపోతే చివరిగా సర్వీస్ సెంటర్‌కే తీసుకెళ్లడం మంచిది. అయితే ఫోన్ ఆన్ అయి ఉపయోగంలోకి వస్తే మాత్రం దాన్ని కొద్ది రోజులు జాగ్రత్తగా పరిశీలించాలి. అందులోని హార్డ్‌వేర్ అంతా పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తుందో లేదో చూడాలి.

CLICKHERE : ఐన్ స్టిన్ జీవితం గురించి తెలిస్తే...ఆశ్చర్యపోతారు

CLICKHERE : రోజూ రెండుసార్లు మజ్జిగ తాగండి.. బరువు తగ్గండి!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top