జియో కి షాక్ ఇచ్చిన ఎయిర్ టెల్..

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో ముందుకుదూసుకుపోతుంది. కొత్త ఏడాది సందర్బంగా న్యూఇయర్ ఆఫర్ గా మర్చి 31 వరకు పొడిగించింది. జియో కి షాకిచ్చేందుకు ఎయిర్ టెల్ సిద్ధమైంది. ఎయిర్ టెల్ 4జీ నెట్ వర్క్ లోకి మరే కస్టమర్లకు 2017 ఏడాది అంతా ఉచిత డేటా అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ 4జీ మొబైల్ హ్యాండ్ సెట్ కస్టమర్లందరికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. 


CLICKHERE : మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

ఈ ఆఫర్ కింద ఎంపికచేసిన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్యాక్స్ నూ ఈ కొత్త ఏడాది డిసెంబర్ చివరి వరకు ప్రతి నెలా 3జీబీ డేటాను ఉచితంగా ఎయిర్ టెల్ అందించనుంది. కంపెనీ ప్యాక్ ప్రయోజనాలకు ఈ ఉచిత డేటా తక్కువగా లేదా ఎక్కువగానూ ఉండొచ్చని కంపెనీ పేర్కొంది. అందుబాటులోని ధరలకు యూజర్లకు 4జీ నెట్ వర్క్ అనుభవం పొందడానికి ఈ ఆఫర్ ను తీసుకొస్తున్నట్టు కంపెనీ చెప్పింది.

CLICKHERE : మొబైల్‌ లో ఫేస్‌బుక్ వాడుతున్నారా.. అయితే ఇక మీద ఆ అవకాశం ఉండదు!!


ఈ ఉచిత డేటా ఆఫర్ కింద అన్ని రకాల ప్రయోజనాలు యూజర్లకు అందించనున్నట్టు, ఫిబ్రవరి 28లోపల ఎయిర్ టెల్ లోకి మారే కస్టమర్లకు ఈ ఆఫర్ అందించనుందని వెల్లడించింది. రేపటి నుంచి ఆ ఆఫర్ అందుబాటులోకి వస్తోంది. ఫిబ్రవరి 28తో ఈ ఆఫర్ గడువు ముగియనుంది. అప్పటివరకు ఎయిర్ టెల్ 4జీ నెట్ వర్క్ లోకి మారాలని సూచించింది. కొత్త 4జీ హ్యాండ్ సెట్ లోకి అప్ గ్రేడ్ అయ్యే ప్రస్తుత ఎయిర్ టెల్ కస్టమర్లకూ ఇది వర్తించనుంది. టెలికాం..

CLICKHERE : సౌదీ గురించి ప్రపంచానికి తెలియని నిజాలివి


ఇండస్ట్రిలో గుబేలు పుట్టిస్తూ మళ్లీ రిలయన్స్ జియో తన ఉచిత ఆఫర్లను మార్చి 31వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. 2017 మార్చి తర్వాత మళ్లీ జియో తన ఆఫర్లను పొడిగించాలని యోచిస్తుందని టెలికాం విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో జియోకు పోటీగా టెలికాం దిగ్గజాలు ఉచిత ఆఫర్లకు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎయిర్ టెల్ ఈ ఉచిత డేటా ఆఫర్ ను ప్రకటించింది.

CLICKHERE : 2017వ సంవత్సరంలో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే అవుతుందట!

Share on Google Plus