ఈటీవీ జ‌బ‌ర్ద‌స్త్‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన మా టీవీ


ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్‌ కామెడీ షో ఎంతటి పాపులర్‌ను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈటీవీ టాప్‌ రేంజ్‌లో ఉంది అంటే ఖచ్చితంగా జబర్దస్త్‌ కారణం అనేది చెప్పవచ్చు. జబర్దస్త్‌కు పోటీగా ఎన్నో కామెడీ షోలు వచ్చాయి. అయితే ఏ ఒక్కటి కూడా జబర్దస్త్‌ను బీట్‌ చేయలేక పోయింది. ఎన్నో కామెడీ షోలు వచ్చాయి పోయాయి, కాని జబర్దస్త్‌ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లకు జబర్దస్త్‌కు పోటీ ఇచ్చే కామెడీ షో వస్తుందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.

స్టార్‌ మా టీవీలో ‘దేశముదుర్లు’ అనే కామెడీ షో రాబోతుంది. మొదట్లో ‘జబర్దస్త్‌’ కామెడీ షోలో నటించినవారే ఇప్పుడు దేశముదుర్లు షోలో కనిపించబోతున్నారు. పోసాని కృష్ణమురళి హోస్ట్‌గా ఈ కార్యక్రమం సాగబోతుంది. శ్రీముఖి యాంకరింగ్‌ చేయబోతుంది. నేటి నుండి ప్రసారం ప్రారంభం కాబోత్ను ఈ దేశముదుర్లు కార్యక్రమం జబర్దస్త్‌ను క్రాస్‌ చేసే సత్తా చూపుతుందా అనేది ప్రస్తుతం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపుతున్న జబర్దస్త్‌కు దేశముదుర్లు పోటీ ఇస్తారా అనేది మరి కాసేపట్లోనే తేలిపోనుంది. ముందు ముందు జబర్దస్త్‌కు ఈ కార్యక్రమం వల్ల చేటు తప్పదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈటీవీ వర్గాల వారు మాత్రం అన్ని కామెడీ షోల మాదిరిగానే ఆ షో కూడా జబర్దస్త్‌ ముందు తేలిపోతుందని అంటున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top