శివాభిషేకం దేనితో చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తప్పకుండా తెలుసుకోండి…షేర్ చెయ్యండి

శివాభిషేక ఫలములు :
1.చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
2. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
3. ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
4.పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.
5.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
6.మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
7.గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
8.అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు –
9.పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు – ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
10.మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
11.ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
12.ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
13.మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
14.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
15.నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
16.నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
17.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
18.బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
19.నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
20.నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21.పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
22.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
23.తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
24.భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
25.ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top