కాటమరాయుడు హిట్టా.. ఫ‌ట్టా - ఫైనల్ రిజ‌ల్ట్ ఇదే


భారీ అంచనాల మీద శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలయింది కాటమరాయుడు మూవీ. అమెరికాలో అయితే ఓ రోజు ముందుగానే… అంటే గురువారం రాత్రే ప్రీమియర్ షోల ద్వారా విడుదలయింది. గబ్బర్‌సింగ్ తర్వాత పవన్, శృతిల కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కథలో పెద్దగా మార్పులు చేయకున్నా.. సినిమాను రిచ్‌గా తీశారు. పవన్, శృతిల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది, ఫైట్స్, డైలాగ్స్ వచ్చి నప్పుడు థియేటర్లు మారుమోగిపోవడం ఖాయం. పవన్ కల్యాణ్ అభిమానులే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది.

అమ్మాయిలంటే ఇష్టం లేని పాత్రలో పవన్ నటన చాలా బాగుంది. అన్నయ్యను ఎలాగైనా ప్రేమలో పడేయాలని తమ్ముళ్ల చేసే ప్రయత్నాలు కామెడీని పండించాయంటున్నారు సినీ ప్రేక్షకులు. తెరపై అన్ని పాటలూ విజువల్ వండర్‌లా కనిపించాయనీ, చాలా రిచ్‌గా తెరకెక్కించారని చెబుతున్నారు. అయితే వీరమ్ సినిమాలోలా.. కాటమరాయుడులో కూడా క్లైమాక్స్ ఉండటం కాస్త నిరాశపరిచే అంశమని కొందరి అభిప్రాయం. పృథ్వి కామెడీ ట్రాక్ బాగానే పండింది. హీరోయిన్ తండ్రిగా నాజర్ నటన కూడా సూపర్బ్. సినిమాలో ట్రైన్ ఫైట్ హైలెట్‌గా నిలుస్తుంది. మొత్తానికి అత్తారింటికి దారేది తర్వాత మరో మెగా హిట్ పవన్ సొంతమైంది
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top