కట్టప్ప రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?


టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం ఎంతటి ఖ్యాతిని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి పార్ట్‌కు సంచలన కలెక్షన్స్‌ రావడంతో ఇప్పుడు రెండవ పార్ట్‌ను అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక బాహుబలి అనగానే రాజమౌళి, ప్రభాస్‌లు గుర్తుకు వస్తారు. 

CLICKHERE : త‌ల దిండు లేకుండా నిద్రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

వీరిద్దరి తర్వాత కట్టప్పను ఎక్కువగా జనాలు తల్చుకుంటున్నారు. బాహుబలిని కట్టప్ప చంపడంతో ఎందుకు చంపాడు అనే ప్రశ్న మొదలైంది. రెండవ పార్ట్‌లో దానికి సమాధానంను జక్కన్న ఇవ్వబోతున్నాడు. ఇక బాహుబలి సినిమాలో ఎంతో ముఖ్యమైన కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్‌ అందుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు.

CLICKHERE : బీర్ త్రాగడం వల్ల శరీరంలో జరిగే కొన్ని భయంకరమైన మార్పులు

టాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సత్యరాజ్‌ రెండు పార్ట్‌లకు గాను 2.25 కోట్ల పారితోషికాన్ని అందుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఒక్కో పార్ట్‌కు కోటికి పైగానే అన్నమాట. ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తున్న సత్యరాజ్‌ ఏ సినిమాకు ఇంత భారీ పారితోషికాన్ని అందుకోవడం లేదు. బాహుబలికి ముందు ప్రభాస్‌ నటించిన ‘మిర్చి’ చిత్రంలో కూడా సత్యరాజ్‌ ఒక ముఖ్య పాత్రలో నటించాడు. 

CLICKHERE : ముఖేష్ అంబానీ అల్లుడు ఎవ‌రో తెలుసా

ఆ పాత్ర కోసం సత్యరాజ్‌ కేవలం 40 లక్షల పారితోషికాన్ని అందుకున్నాడు. ‘బాహుబలి’ కోసం ఎక్కుడ డేట్లు అవసరం అవ్వడంతో జక్కన్న రెండు పార్ట్‌లకు కలిపి 2.25 కోట్ల పారితోషికాన్ని ముట్ట జెప్పారు. పారితోషికం సంగతి ఏమో కాని బాహుబలి చిత్రంతో కట్టప్పగా సత్యరాజ్‌కు దేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top