నగ్మా ఇంకా పెళ్లెందుకు చేసుకోలేదో తెలుస్తే షాకే!


హీరోయిన్ నగ్మా గురించి అందరికి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళం, మళయాళీ.. అన్ని భాషల్లో నగ్మా హీరోయిన్ గా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు దక్షణాదిలో స్టార్ హీరోయిన్ రేంజ్ ను ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా పెద్దదే. దీంతో ఆమెకు హీరోయిన్ చాన్స్ లు వెతుకుంటూ వచ్చేవి.

ప్రస్తుతం 4 పదుల వయసు దాటేసినా అసలు నగ్మా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. నగ్మాతో లవ్ ఎఫైర్ నడిపి చివరకు రాధికను పెళ్లి చేసుకుని కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్ హ్యాండివ్వడం వల్లే ఆమె పెళ్లి చేసుకోలేదని అప్పట్లో టాక్ నడిచింది. ఇక అప్పటి నుంచి పెళ్లి గురించి ఆలోచించని నగ్మా భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ఎఫైర్ నడిపిందని వార్తలు వచ్చాయి.. వారిద్దరూ కలిసి శ్రీ కాళహస్తి దేవాలయం లో పూజలు కూడా చేయడం వల్ల ఈ రూమర్స్ పుట్టుకొచ్చాయి.

ఆ తర్వాత ఎఫైర్లకు దూరంగా ఉన్న నగ్మా.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీల పాత్ర పోషించాలని ఆశపడ్ద నగ్మాను.. ఆ పార్టీ గుర్తించకపోవడంతో.. ఇప్పటికీ రాజకీయాల్లో రాణించాలనే చూస్తోంది. నగ్మా ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రచారం జరగడం ఆమెకు కాంగ్రెస్ సీటు కేటాయించకపోవడం మామూలయిపోయింది. రాజకీయాల విషయం పక్కన పెడితే... దాదాపు 9 బాషలపై నగ్మాకు పట్టు ఉండడం ఆమెకు కలిసి వచ్చే అంశం.

తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్, మరాఠీ, బెంగాలి, మలయాళం బాషలలో నగ్మా అనర్గళంగా మాట్లాడుతుందని ఆమెకు తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. ఇక కోలీవుడ్ హీరోయిన్ జ్యోతిక నగ్మాకు చెల్లెలు. కాకపోతే వీరిద్దరికీ తల్లి దండ్రులు వేరు. మొత్తానికి హీరోయిన్ గా సక్సెస్ సాదించిన నగ్మా అటు పెళ్లి చేసుకోలేక, ఇటు రాజకీయాల్లో రాణించలేక ఇబ్బంది పడుతుందనే చెప్పాలి. మరి ఈ రెండిట్లో ఏది ముందుగా సక్సెస్ అవుతుందో చూడాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top