శిశువు ఆరోగ్యంగా ఎదగాలంటే మసాజ్ అవసరమా?


పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఎదగటానికి మసాజ్ ఎంతగానో సహాయపడుతుంది. మసాజ్చే సే ముందు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే బిడ్డ ఆరోగ్యంగా ఎదగటమే కాకుండా అది మీకు ఎంతో తృప్తిని ఇస్తుంది. చిన్న పిల్లల ఎదుగుదలకు మసాజ్ చాలా అవసరం. మసాజ్ చేస్తే చక్కగా నిద్రపోవటమే కాకా అన్ని రకాల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

మసాజ్ చేయటం వలన కండరాలు గట్టి పడతాయి శిశువుకు చర్మ సంబంద వ్యాధులు ఉంటే మాత్రం మసాజ్ చేయకూడదు. మసాజ్ చేసేటప్పుడు కాళ్ళ నుండి మొదలు పెట్టి తల దాకా చేయాలి. కాళ్ళతో మొదలు పెట్టి క్రమంగా మోకాళ్ళు, వీపు, పొట్ట, చేతులు, భుజంపై మసాజ్ చేయాలి.

ముఖం,తలపై రెండు చేతులతో పై పైన మసాజ్ చేయాలి. ఎప్పుడు క్లాక్ వైజ్ మసాజ్చేయాలి. అన్ని బాగాలకు ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి అంటే కాళ్ళకు మసాజ్చేసేటప్పుడు ముందుగా చేతులను, కాళ్ళు, మోకాళ్ళ దాక తీసుకువెళ్ళి మసాజ్ చేయాలి. ఆ తర్వాత మోకాళ్ళ నుండి తొడల దాక అలాగే మొదట ముంజేతుల పై నుంచి మో చేయి వరకు, మోచేతి నుంచి భుజాల వరకు మసాజ్ చేస్తూ పోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top