గుండె పదిలంగా ఉండాలంటే....మార్పులు అవసరమా?

ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల వల్ల చాలా మంది చిన్న వయస్సులోనే గుండె వ్యాధుల బారిన పడుతున్నారు. ఆ ముప్పు రాకుండా గుండె పదిలంగా ఉండాలంటే ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే సరి.

శాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండే ఆహారపదర్దాలు గుండెకు చేటుచేస్తాయి. మేక, పంది, ఎద్దు మాంసాలకు,ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది. ఉప్పు,పంచదార మితంగా తీసుకుంటే మంచిది.

హై బిపి ఉండే వారిలో గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వారు రోజుకి రెండు అరటి పండ్లు తింటే రక్తపోటు అడుపులో ఉంటుంది.

పాలల్లో ఉండే కాల్షియం గుండె పనితీరును పెంచుతుంది. రోజు కనీసం 200 ml వెన్న తీసిన పాలను త్రాగితే మంచిది.

గ్రీన్ టీలో ఉండే ఫ్లవనయిడ్స్ రక్త ప్రసరణ పెంచటంలో సహాయపడతాయి.

శరీరంలో అన్ని కండరాల వలే గుండె పనితీరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. ఏ వ్యాయామం అయినా సరే రోజుకు అరగంట సేపు చెమట పట్టేలా చేస్తే చాలు.

అలాగే రోజుకి 15 నుంచి 20 నిముషాలు నడక కూడా గుండె ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top