నాలుక తెలిపే ఆరోగ్య రహస్యాలు...అసలు నమ్మలేరు


మనం సాదారణంగా డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు రొటీన్ చెకప్ లో బాగంగా నాలుకను చూస్తారు. మన నాలుక మొత్తం మన ఆరోగ్యాన్ని చెప్పేస్తుంది. నాలుకను చూసి అనేక రకాల వ్యాధులను ప్రాధమికంగా గుర్తించవచ్చు. నోటిలో చిగుళ్ళ తరువాత నాలుక మీదే ఎక్కువగా వ్యాధి కారకాలు నివసిస్తాయి.అయినప్పటికీ నాలుక అనేది మన శరీరంలో ఎక్కువ నిర్లక్ష్యం చేసే అవయవాలలో ఒకటిగా ఉంది.

నాలుక ఒక అంతర్గత అవయవం అయిన సరే, బాహ్య అవయవాలను ఏ విధంగా అద్దంలో చూసుకుంటామో అలాగే నాలుకను కూడా చూస్తూనే ఉంటాం. నాలుక బహిర్గతం చేసే విషయాలను చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అనేక వ్యాధులను గుర్తించటంలో నాలుక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల మనం నాలుకను ఆరోగ్యకరముగా నిర్వహించవలసిన బాధ్యత ఉంది.ఇక్కడ నాలుక మీద లక్షణాల బట్టి వివిధ ఆరోగ్య సమస్యలను ఎలా గుర్తించవచ్చో చూద్దాం.

1. ముదురు ఎరుపు రంగు
సాదారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క నాలుక గులాబి రంగులో ఉంటుంది. నాలుక ముదురు ఎరుపు రంగులో ఉంటే, అది రక్తహీనత, కవాసాకి వ్యాధి మరియు స్కార్లెట్ జ్వరం వంటి వాటికి సంకేతంగా భావించాలి. నాలుక ముదురు ఎరుపు రంగులో ఉంటే విటమిన్ బి 12 లోపం ఉందని గుర్తించాలి. శరీరంలో ఎర్ర రక్తకణాలను తయారుచేయటానికి విటమిన్ B12 అవసరం. ఇది లోపిస్తే అలసట మరియు రక్తహీనత కలుగుతాయి.

కెనడియన్ డెంటల్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించిన 2009 అధ్యయనంలో ముదురు ఎరుపు రంగు నాలుక ఆరంభంలో ఎరుపు మచ్చలు లేదా పాచెస్ రూపంలో కనపడుతుంది. ఒక వ్యక్తికి రక్తహీనత ఉందని చెప్పటానికి ఇది ఒక భౌతిక లక్షణంగా చెప్పవచ్చని తెలిపింది.

ఇండియన్ నేషనల్ మెడికల్ జర్నల్ 2005 లో ప్రచురించిన ఒక అధ్యయనంలో స్ట్రాబెర్రీ ఎరుపు నాలుక కవాసాకి వ్యాధి యొక్క అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటిగా తెలిపింది. రక్త నాళాలు వాచే ఈ వ్యాధి ఎక్కువగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో కనపడుతుంది.

స్కార్లెట్ ఫీవర్ కి కూడా స్ట్రాబెర్రీ ఎరుపు నాలుక ఒక సాధారణ లక్షణంగా ఉంది. ఈ బాక్టీరియా వ్యాధి ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. అయితే 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లల్లో ఈ వ్యాధి సాదారణం. ఇన్ఫెక్షన్ జర్నల్ లో ప్రచురించిన 2007 అధ్యయనంలో స్కార్లెట్ జ్వరంతో
బాధపడుతున్న 45 మందిలో 30 మందికి నాలుక స్ట్రాబెర్రీ ఎరుపు రంగులో ఉందని తెలిపింది.

2. తెలుపు పాచెస్
సాదారణంగా నాలుక మీద తెల్లటి రంగులో, కాటేజ్ చీజ్ లాంటి పూత పాచెస్ గా ఏర్పడుతుంది. ఇది నోటి కాన్డిడియాసిస్ వ్యాధి అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. ఇది నోటిలో ఈస్ట్ సంక్రమణ ద్వారా కలుగుతుంది. ఇది సాదారణంగా ముసలి వారు,పసి పిల్లల్లో రోగనిరోదక శక్తి తగ్గటం వలన ఏర్పడుతుంది.

కొన్ని రకాల మందులు ( బర్త్ కంట్రోల్ మాత్రలు మరియు యాంటీబయాటిక్స్) వాడటం వలన నాలుక మీద ఈస్ట్ ఇన్ ఫెక్షన్ రావచ్చు. దీని వలన బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, సోరియాసిస్ మరియు మధుమేహం, స్థూలకాయం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. నోటి కాన్డిడియాసిస్ కి సరైన చికిత్స చేస్తే నయం చేయటానికి ఎంతో కాలం పట్టదు. ఈ వ్యాధి దీర్ఘకాలికంగా ఉంటే HIV లేదా ల్యుకేమియా వంటి వ్యాధులు ఉన్నాయని గుర్తించాలి.

3. అసాదారణ మృదుత్వం
నాలుక ఉపరితలం మీద చిన్న వెంట్రకల వంటి నిర్మాణాలు ఉండుట వలన నాలుక కరుకుగా ఉంటుంది. ఈ విధంగా మృదుత్వం కోల్పోయి కరుకుగా ఉన్న నాలుక అసాధారణంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో ఉన్న నాలుకను కృశించిన నాలుక అంటారు. ఈ స్థితిలో నాలుక మంట మరియు నొప్పి ఉంటుంది. ఈ రకమైన పరిస్థితికి పోషక లోపంనకు సంబంధం ఉంది.

ఓరల్ పాథాలజీ మరియు మెడిసిన్ జర్నల్ 2012 అధ్యయనంలో 176 మందిని పరిశీలించగా, వారిలో 38 మంది రక్తనాళ వ్యాధుల బారిన పడే ప్రమాదం, 47 మంది ఇనుము లోపం కలిగి ఉండటం, 39 మంది హిమోగ్లోబిన్ లోపం కలిగి ఉండటం, 13 మంది విటమిన్ బి 12 లోపం కలిగి ఉండటం, ముగ్గురు ఫోలిక్ యాసిడ్ లోపం కలిగి ఉన్నారని తెలిపింది.

4. మందపాటి, పసుపు పూత
నాలుక మీద పసుపు పూత రావటానికి వేడి చేయటం మరియు బాక్టీరియా కారణం కావచ్చు. సంప్రదాయ చైనీస్ ఔషధం ప్రకారం, ఒక ఎర్రబడిన నాలుక మీద ఒక పసుపు పూత అనేది శరీరంలో చాలా వేడి ఉందని అర్ధం.

పశ్చిమ వైద్య ప్రకారం, నాలుక మీద ఒక మందమైన, పసుపు పూత అనేది బాక్టీరియా చర్య ఎక్కువగా ఉందని సూచిస్తుంది. నోటి పరిశుభ్రత లేకపోవటం, నోటి శ్వాస మరియు జ్వరం వంటి కారణాల వలన బాక్టీరియా ఎక్కువగా ఉందని తెలుస్తుంది.

సాదారణంగా నాలుక మీద ఒక మందమైన, పసుపు పూత అనేది ప్రమాదకరం. అయినా దీనిని సరైన నోటి పరిశుభ్రత ద్వారా నయం చేయవచ్చు. ఇది ఒక వ్యాధికి పెద్ద సంకేతం కావచ్చు. ఈ విధమైన పరిస్థితి ఉంటే కొంత మంది గుండె రోగుల్లో స్ట్రోక్స్ ను ముందుగా గుర్తించవచ్చని తెలిసింది.

5. నొప్పి లేని పొక్కులు
నాలుక మీద నొప్పి లేని పొక్కులు రెండు వారాల కన్నా ఎక్కువ రోజులు ఉంటే కనుక అది నోటి క్యాన్సర్ ప్రారంభ సంకేతం కావచ్చు. ఈ చిన్న పొక్కులు తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు తీసుకున్న ఆహారం మింగటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది.

ఆస్ట్రేలియన్ డెంటల్ జర్నల్ లో ప్రచురించిన 2011 అధ్యయనంలో నాలుక ఉపరితలం మీద తెలుపు లేదా ఎరుపు పాచెస్ ఏర్పడటం అనేది నోటి క్యాన్సర్ లక్షణం అని తెలిపారు. ధూమపానం అలవాటు ఉండి ఈ లక్షణం కనపడితే మాత్రం చాలా ప్రమాదకరం.

డెంటల్ అండ్ క్రానియోఫేసియల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ వారు తెలుపు గడ్డలు కంటే ఎర్రటి బొడిపెలు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఎర్రటి బొడిపెలు కారణంగానే క్యాన్సర్ ముప్పు ఉందని తెలిపారు.
Share on Google Plus