జుట్టు ఆరోగ్యంగా ఎదగటానికి తీసుకోవలసిన ఆహారం

బయోటిన్ లోపించినప్పుడు జుట్టు పల్చగా అవటం,చిట్లటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ బయోటిన్ అరటి,బీన్స్,క్యాలి ఫ్లవర్, గుడ్లు వంటి వాటిలో సమృద్దిగా ఉంటుంది. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఒమేగా 3 ప్యాటి ఆమ్లాలు జుట్టు కుదుళ్ళను బలంగా మారుస్తాయి. అవి శరీరంలో లోపించినప్పుడు మాడు పొడి బారటం, వెంట్రుకలు నిర్జీవంగా మారటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒమేగా 3 ప్యాటి ఆమ్లాలు గుడ్లు,అవిసె గింజలు,చేప నూనె, వల్నట్స్ లలో సమృద్దిగా ఉంటాయి.

జుట్టు బలంగా ఎదగటానికి గుడ్లు,చికెన్, తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు,నట్స్, సముద్ర ఆహారం,సోయా బీన్స్,తృణ ధాన్యాలలో ప్రోటిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి అధికంగా అందితే వెంట్రుకలు బలంగా పెరుగుతాయి.

జుట్టు ఆరోగ్యంగా ఎదగటానికి మాడుపై విడుదల అయ్యే సెబమ్ ఉపయోగపడుతుంది. దీన్ని ఉత్పత్తి చేయటంలో విటమిన్ ఎ కీలక పాత్రను పోషిస్తుంది. విటమిన్ ఎ అఫ్రికాట్,క్యారట్, కోడిగుడ్డు సోన,మామిడి,ఓట్ మిల్, పాలకూర వంటి వాటిలో సమృద్దిగా ఉంటుంది.
Share on Google Plus